RRR కోసం తెలుగు పాఠాలు

Published : Apr 07, 2019, 10:10 AM IST
RRR కోసం తెలుగు పాఠాలు

సారాంశం

దర్శకదీరుడు రాజమౌళి వల్ల బాలీవుడ్ సెలెబ్రెటీలు తెలుగు నేర్చుకునే సీన్స్ కనిపిస్తున్నాయి. RRR కోసం ఇప్పుడు హాట్ బ్యూటీ అలియా భట్ తెలుగు నేర్చుకుంటోంది. 

టాలీవుడ్ సినిమాలంటే మొన్నటివరకు బాలీవుడ్ ప్రముఖులు అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ బాహుబలి అనంతరం ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాల మార్కెట్ కూడా నార్త్ లో గట్టిగానే పెరుగుతోంది. ఇక బాలీవుడ్ తారలు ఇక్కడ అవకాశాలు వస్తే ఏ మాత్రం వదలడం లేదు. 

దర్శకదీరుడు రాజమౌళి వల్ల బాలీవుడ్ సెలెబ్రెటీలు తెలుగు నేర్చుకునే సీన్స్ కనిపిస్తున్నాయి. RRR కోసం ఇప్పుడు హాట్ బ్యూటీ అలియా భట్ తెలుగు నేర్చుకుంటోంది.  తెలుగు చాలా గొప్ప బాషా అంటూ.. నేర్చుకోవడం కష్టమైనప్పటికీ భావాలను స్వచ్ఛంగా వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉండే బాషా అని తెలిపింది. 

ఇక RRR కోసం అమ్మడు సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి డిసైడ్ అయ్యింది. వీలైనంత వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని రాజమౌళి గారి మేకింగ్ కి తగ్గట్టుగా నేను సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత ఎంతో ఉందని అలియా వివరణ ఇచ్చింది. ఇక RRRలో అలియా అల్లూరి సీతారామరాజు మరదలి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గాయం కారణంగా ఇటీవల పూణే షెడ్యూల్ ని జక్కన్న వాయిదా వేశారు. ఇక నెక్స్ట్ వీక్ ఆ షెడ్యూల్ మళ్ళీ స్టార్ట్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?