ఆలియా భట్ తండ్రి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు హార్ట్ సర్జరీ, కోలుకుంటున్న మహేష్ భట్

By Mahesh JujjuriFirst Published Jan 21, 2023, 9:34 PM IST
Highlights

హార్ట్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ లో చేరారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఆలియా భట్ తండ్రి మహేష్ భట్. హార్ట్ సర్జరీజరగడంతో ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు మహేష్ భట్. 

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, నిర్మాత హీరోయిన్  అలియా భట్‌ తండ్రి మహేశ్‌ భట్‌ హాస్పిటలైజ్ అయ్యారు. ఆయనకు  హార్ట్‌ ప్రాబ్లమ్ రావడంతో  సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. గత నెలలో చెకప్‌ కోసం ఆయన హాస్పిటల్ కు వెళ్లగా ప్రాబ్లమ్ ఉందని గుర్తించారు. వెంటనే ఆఞన  యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. వెంటనే డిస్చార్జ్ అవ్వడంతో ఇంటికి వెళ్ళారట మహేష్ భట్. ఆయన ప్రస్తుతం ఇంట్లో ఉండి కోలుకుంటున్నారు. 

ఇక మహేశ్‌ భట్‌ ఆరోగ్యంపై ఆయన తనయుడు రాహుల్‌ భట్‌  విషయాన్ని ధ్రువీకరించారు. ఈ వారం మొదట్లో మహేశ్‌ భట్‌ ఆసుపత్రిలో చేరినట్లు రాహుల్‌ తెలిపాడు. గుండెకు ఆపరేషన్ జరిగినట్టు తెలిపారు. కాని విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.  ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారని రాహుల్ పేర్కొన్నాడు. అంతే కాదు ప్రస్తుంతం మహేష్ భట్ బాగానే  ఉన్నారని, ఇంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేనని తెలిపాడు. 

అయితే, గత నెలలో ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లగా.. త్వరగా హార్ట్‌ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. మహేశ్‌ భట్‌ బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగారు. ఆయన  26 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు.. తొలిసారిగా దర్శకత్వం చేశారు. మంజిలీన్ ఔర్ భీ హై సినిమాతో డైరెక్టర్ గా మారిన ఆయన వరుస సినిమాలో బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించారు. వరుసగా సారాంశ్, ఆషికి, జెహెర్, జిస్మ్ సినిమాలను రూపొందించారు మహేష్ భట్.  రాజ్, దుష్మన్, ఫుట్‌పాత్ సినిమాలకు రైటర్ గా పనిచేశారు. 

మహేష్ నటవారసత్వాన్ని పునికిపుచ్చింది ఆయన కూతురు ఆలియా భట్. బాలీవుడ్ లో మీరోయిన్ గా తనకంటై ప్రత్యేక ఇమేజ్ ను సాధించుకుంది. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది బ్యూటీ. లాస్ట్ ఇయర్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడి ఏడాది తిరక్కముందే తల్లి కూడా అయ్యింది ఆలియా భట్. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. హీరోయిన్ గా కెరీర్ ను కంటీన్యూ చేస్తానంటోంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియ రేంజ్ లో దడదడలాడించింది బ్యూటీ. 


 

click me!