ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు’ సాంగ్ కు రష్మిక మందన్న మరోసారి డాన్స్ ఇరగదీసింది. రష్మికతో పాటు అలియా భట్ సైతం ఈసెన్సేషనల్ సాంగ్ కు స్టెప్పులేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
95వ ఆస్కార్స్ అవార్డుల వేడుకుల్లో సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మకమైన Oscar Award దక్కిన విషయం తెలిసిందే. ఈ అవార్డు అందిన తర్వాత మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కడో ఓ చోట నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంంట్ గా ప్రారంభమైన ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో ‘నాటు నాటు’ సాంగ్ ను మోగించిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మాస్ స్టెప్పులతో ఇరగదీసింది.
తాజాగా దిగ్గజ వ్యాపర వేత్త ముఖేష్ అంబానీ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ (JWC)లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓపెనింగ్ వేడుకులను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బాలీవుడ్, సౌత్ టాప్ సెలెబ్రెటీలు హాజరవుతున్నారు. అయితే ఈ వేడుకల్లోనూ ఆస్కార్ విన్నింగ్ Naatu Naatu సాంగ్ ను ప్లే చేశారు. స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, అలియా భట్ (Alia Bhatt) కలిసి నాటుు స్టెప్పులేశారు. హుక్ మూమెంట్ తో అదరగొట్టారు. స్టార్ బ్యూటీలు అద్భుతంగా చేసిన డాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నీతా ముఖేష్ అంబానీ కల్చరర్ సెంటర్ ప్రారంబోత్సవం సందర్భంగా నిన్నటి నుంచి వేడుకులు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్, తమన్నా భాటియా, క్రితి సనన్ హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్ కూడా హాజరై డాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈవెంట్ కు హాలీవుడ్ స్టార్స్ పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, గిగి హడిడ్, సైతం హాజరై సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.