బిగ్ బాస్ 3: అలీ రెజా ఎలిమినేషన్.. వెక్కి వెక్కి ఏడ్చేసిన హౌస్ మేట్స్!

Published : Sep 08, 2019, 11:04 PM IST
బిగ్ బాస్ 3: అలీ రెజా ఎలిమినేషన్.. వెక్కి వెక్కి ఏడ్చేసిన హౌస్ మేట్స్!

సారాంశం

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా చెప్పుకుంటోన్న బిగ్ బాస్‌ తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ప్రస్తుతం మూడో సీజన్ సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ అదిరిపోయే షాక్ ఇచ్చారు.  

బిగ్ బాస్ రియాలిటీ షో ఏడు వారాలు పూర్తి చేసుకొంది. ఇక ఈ వారం అలీ ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సీజన్‌కు బలమైన కంటెస్టెంట్‌గా చెప్పుకుంటోన్న అలీ రెజా ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఏడోవారం ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, మహేష్ విట్టా, రవికృష్ణ నామినేట్ అయ్యారు. వీళ్లు నలుగురిలో అలీ రెజా ఎలిమినేట్ అవుతాడనే వార్తలు ముందుగానే బయటకి వచ్చాయి. కానీ హౌస్‌మేట్స్ కానీ, ప్రేక్షకులు కానీ అలీ ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు.

అయితే అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో అందరూ షాక్ అయ్యారు. ఇక శివజ్యోతి, శ్రీముఖి, హిమజ ఏడుపు మొదలుపెట్టారు. రవి, రాహుల్, వరుణ్ సందేశ్ ఇలా అందరూ ఎమోషనల్ అయ్యారు. శ్రీముఖి, శివజ్యోతి అయితే వెక్కి వెక్కి ఏడ్చారు.

రాహుల్, రవిలు ఏడవడం భావోద్వేగానికి గురి చేసింది. అలా ఎలిమినేట్ అయిన అలీ స్టేజ్ మీదకి వచ్చిన తరువాత నాగార్జున.. అలీకి ఒక టాస్క్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరితో అలీ ఫోన్ లో మాట్లాడుతూ వారిని గేమ్ బాగా ఆడాలని చెప్పాడు. ఇక బిగ్ బాంబ్ రవి మీద వేశాడు. దీని ప్రకారం రోజులో గంట సేపు రవి జిమ్ లో గడపాలి. 

PREV
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్