'సైరా' : మహేష్ బాబు స్పెషల్ రివ్యూ..!

Published : Oct 03, 2019, 12:47 PM IST
'సైరా' : మహేష్ బాబు స్పెషల్ రివ్యూ..!

సారాంశం

సైరా సినిమా నిన్న రిలీజ్ అయ్యి అన్ని వర్గాల నుండి కూడా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మీద ఏర్పడిన హైప్‌తో మొదటిరోజే చాలా మంది సెలబ్రిటీ‌లు కూడా ఈ సినిమా చూసారు.   

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. 'బాహుబలి' తరువాత ఆ రేంజ్ లో ఉన్న సినిమా ఇదేనంటూ తెగ పొగిడేస్తున్నారు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజమౌళితో సహా చాలా మంది సెలబ్రిటీలు మొదటిరోజే ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ సినిమాకి మంచి టాక్ వచ్చినా సరే ఆ సినిమా చూసి సోషల్ మీడియాలో స్పందించిన మహేష్ బాబు బాబు 'సైరా' సినిమాను రిలీజ్ రోజే చూశారు. 

అనంతరం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. సినిమా స్కేల్, గ్రాండియర్, విజువల్స్ కంటే చిరంజీవి గారి నటన చాలా గొప్పగా ఉందని చెప్పారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ వర్క్ గురించి మాత్రం స్పెషల్‌గా మాట్లాడాడు. అవుట్ స్టాండింగ్ సినిమాటోగ్రఫీ. ఈ మధ్య కాలంలో ఇది బెస్ట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఇక నేచురల్ స్టార్ నాని కూడా 'సైరా' గురించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సౌత్ కొరియాలో ఉన్న నానికి అక్కడ సినిమా చూసే ఛాన్స్ లేదట. కానీ టాక్ వినబడిందని, ఇండియాలో బాక్సాఫీస్ ఘరానామొగుడు ఈజ్ బ్యాక్  అని.. సినిమా చూడడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి