యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న అక్కీ, కైరాల `బుర్జ్ ఖలీఫా` వీడియో సాంగ్‌

Published : Oct 18, 2020, 06:04 PM IST
యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న అక్కీ, కైరాల `బుర్జ్ ఖలీఫా` వీడియో సాంగ్‌

సారాంశం

`లక్ష్మీబాంబ్‌` చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. `బుర్జ్ ఖలీఫా.. `పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ని తాజాగా ఆదివారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌, కైరా రొమాన్స్ అదిరిపోయింది. 

బాలీవుడ్‌ సునామి అక్షయ్‌ కుమార్‌, క్రేజీ హీరోయిన్‌ కైరా అద్వానీ కలిసి `లక్ష్మీబాంబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో వచ్చిన `కాంచన` చిత్రానికి రీమేక్‌. దీనికి కూడా రాఘవ లారెన్స్స దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఓటీటీలో విడుదల కాబోతుంది. నవంబర్‌ 9న డిస్నీ హాట్‌ స్టార్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ  చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. `బుర్జ్ ఖలీఫా.. `పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ని తాజాగా ఆదివారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌, కైరా రొమాన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా దుబాయ్‌ రాజు తరహాలో అక్షయ్‌ గెటప్‌, సింధీ అమ్మాయిగా కైరా అద్వానీ అందచందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విడుదలైన గంటలోనే నాలుగు మిలియన్ల మంది దీన్ని వీక్షించడం విశేషం. ఈ పాటని శశి కంపోజ్‌ చేయగా, డీజే ఖుషి, నిఖితా గాంధీ ఆలపించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు