కార్తీని పవన్ కళ్యాణ్ తో పోల్చిన నాగార్జున.. అలా చేయడం వీరికే సాధ్యమైందంటా.!

Published : Oct 20, 2022, 11:07 AM IST
కార్తీని పవన్ కళ్యాణ్ తో పోల్చిన నాగార్జున.. అలా చేయడం వీరికే సాధ్యమైందంటా.!

సారాంశం

తెలుగులోనూ తమిళ హీరో కార్తీకి మంచి గుర్తింపు, మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కార్తీని పోల్చుతూ నాగార్జున ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

తమిళ స్టార్, టాలెంటెడ్ హీరో కార్తీ (Karthi) గ్యాప్ లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నారు.  విభిన్న కథలను ఎంచుకుంటూ  దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. అద్భుతమైన నటనతో మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. కార్తీ తాజాగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’(Sardar). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ‘సర్దార్’ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హాజరయ్యారు. 

చీఫ్ గెస్ట్ గా హాజరైన నాగార్జున వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కార్తీని పోల్చుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. కార్తీతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ‘ఊపిరి’ సినిమాతో బాగా దగ్గరయ్యామన్నారు. కార్తీ కేరీర్ లో ఎదిగిన తీరు, సాధించుకున్న క్రేజ్ అంత సులువు కాదన్నారు. కార్తీ అన్నయ్య సూర్య అప్పటికే తమిళంలో సూపర్ స్టార్. ఆయన తమ్ముడు అనే ఇమేజ్ నుంచి బయట పడటం అంతా ఈజీ కాదు. కానీ కార్తీ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకోవడం గొప్పవిషయం.

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా అన్నయ్య చిరంజీవి ఇమేజ్ నుంచి బయటపడి సొంతగా ఎదిగారు.  ఇక్కడ పవన్ కళ్యాణ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, తమిళంలో సూర్య సొంతం ఇమేజ్ ను సంపాదించుకోవడం గొప్ప విషయం. ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. అందులో కార్తీ కూడా ఉండటం సంతోషంగా ఉందని పొగిడేశారు. ఇక కార్తీ ‘సర్దార్’ను అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో సంతోషంగా ఉందని చెప్పారు. 

హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్లుగా రజీషా విజయం, రాశీ ఖన్నా (Raashi Khanna) కనువిందు చేయనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత లక్ష్మణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కార్తీ డ్యూయల్ రోల్ చేస్తుండటం, సీనియర్ నటి లైలా కూడా కీలక పాత్ర పోషించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 21న (రేపు) గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ