జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్... అంచనాలు అందుకునేనా!

By Sambi ReddyFirst Published Oct 20, 2022, 10:40 AM IST
Highlights

మరొక బాక్సాఫీస్ పరీక్షకు ఆర్ ఆర్ ఆర్ సిద్ధం అవుతుంది. జపాన్ లో రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఈ క్రమంలో జపాన్ వెళ్లిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రమోషన్స్ షురూ చేశారు. 
 

ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21న గ్రాండ్ గా స్థానిక భాషలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ లో ప్రమోషన్స్ నిర్వహించడం కోసం యూనిట్ ఆ దేశం వెళ్లారు.రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ మీడియాతో మాట్లాడారు. జపాన్ ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరుకున్నారు. మూవీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. 

రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 జపాన్ లో ఆదరణ దక్కించుకున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ సైతం విజయం సాదిస్తుందని భావిస్తున్నారు. ఆయన బ్రాండ్ నేమ్ జపాన్ లో పని చేసే అవకాశం కలదు. కాగా ఎన్టీఆర్ కి జపాన్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన డాన్సులు, నటన జపాన్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఇక రామ్ చరణ్ కి కూడా గుర్తింపు ఉంది. జపాన్ ప్రేక్షకులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నిర్మాత డివివి దానయ్య ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. శ్రీయా సైతం మూవీలో తళుక్కున మెరిశారు. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆస్కార్ బరిలో దించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారు. జనరల్ కేటగిరిలో 15 విభాగాల్లో నామినేషన్స్ కి అప్లై చేశారు. ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ మూవీ సత్తా చాటుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

click me!