BB7 : బిగ్ బాస్ 7లో సమంత గురించి అడిగిన నాగార్జున.. ఆన్సర్ చేసిన విజయ్ దేవరకొండ.. హౌజ్ లో రౌడీ హీరో రచ్చ..

Published : Sep 03, 2023, 10:13 PM ISTUpdated : Sep 03, 2023, 10:16 PM IST
BB7 : బిగ్ బాస్ 7లో సమంత గురించి అడిగిన నాగార్జున..  ఆన్సర్ చేసిన విజయ్ దేవరకొండ.. హౌజ్ లో రౌడీ హీరో రచ్చ..

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ప్రారంభం సందర్భంగా షోకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున సమంత గురించి అడగటం ఆసక్తికరంగా మారింది.   


బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ గా ఈరోజు సాయంత్రం (సెప్టెంబర్ 3)న ప్రారంభమైంది. మొదటి ఐదుగురు కంటెస్టెంట్స్ కూడా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ఐదుగురు కంటెస్టెంట్లుగా టీవీ నటి ప్రియాంక జైన్, సీనియర్ నటుడు శివాజీ, సింగర్ దామిని, మోడల్ ప్రిన్స్ యావర్, లాయర్ సుభా శ్రీ ఎంట్రీ ఇచ్చారు.  ఆ తర్వాత ఆ తర్వాతి  ఐదుగురు కంటెస్టెంట్స్ గా షకీలా, ఆట సందీప్, శోభా శ్రీ,, యూట్యూబర్ టేస్టీ తేజ, రతికా ఎంట్రీ ఇచ్చారు. మొత్తం పది మంది కంటెస్టెంట్లు హౌలోకీ రావడంతో వారందరికీ సర్ ప్రైజ్ ఇస్తూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. 

‘ఖుషి’ చిత్రంలోని ఆరాధ్య సాంగ్ తో హౌజ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో నాగ్ తో సంభాషించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ‘ఖుషి’ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు, చాలా హ్యాపీగా ఉందని విజయ్  షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఖుషి’లో విజయ్ సరసన నటించిన సమంత గురించి కూడా అడగడం ఆసక్తికరంగా మారింది. అయితే విజయ్ తో మాట్లాడుతూ... మీ హీరోయిన్ రాలేదేంటీ? అని అడిగారు. అందుకు విజయ్ బదులిస్తూ.. యూఎస్ ప్రీమియర్స్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం వెళ్లిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కలిసి ప్రమోట్ చేస్తామని తెలిపారు. 

ఆ తర్వాత  నాగార్జున మాట్లాడుతూ...  సమంత మంచి నటి అని,  అద్భుతంగా పెర్పామ్ చేస్తుందని అభినందించారు. అయితే సామ్ తో నటించడంతో ఎవరి పెర్ఫామెన్స్  డామినేట్ చేసేలా ఉందని కూడా విజయ్ ను అడిగారు. సామ్ గురించి ఇలా పలు క్వశ్చన్స్ అడగడం ఆసక్తిగా మారింది.  ఆ తర్వాత విజయ్ దేవరకొండ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి... పది మంది కంటెస్టెంట్లను కలిసి జోష్ నింపారు. చిన్న టాస్క్ తో  అందరినీ ఉత్సాహపరిచారు. కంటెస్టెంట్లు అందరూ బాగా పెర్ఫామ్ చేయాలని సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌