అక్కినేని చేసిన‌ అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను: దాసరి

Published : Jan 26, 2017, 02:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
అక్కినేని చేసిన‌ అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను: దాసరి

సారాంశం

అక్కినేని నాగేశ్వరరావు దాస‌రిని ఒక సందర్భంలో ఘోరంగా అవమానించారట‌ అవమానించిన‌  విషయాన్ని జీవితంలో ఎన్నడూ బయట పెట్టలేను అలాగని మర్చిపోలేను అంటున్న దాస‌రి  వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన   ప్రేమాభిషేకం శ్రీవారి ముచ్చట్లు  మేఘ‌సందేశం  మూవీలు  హిట్ సాధించాయి

 

అక్కినేని నాగేశ్వరరావు తనకు ఒక సందర్భంలో ఘోరంగా అవమానించారని, ఆనాటి నుంచి తమమధ్య సంబంధాలు సరిగా లేవని దాసరి చెప్పారు. ఆ తర్వాత అక్కినేనితో సత్సంబంధాలకు కూడా ప్రయత్నించలేదన్నారు. అక్కినేని ప్రవర్తన తనను చాలా బాధపెట్టించిందన్నారు. కానీ ఆ విషయాన్ని నేను బయటకు వెల్లడిస్తే అక్కినేని నాగేశ్వరరావుపై ప్రజలకు ఉన్న గౌరవం మొత్తం పోతుందని దాసరి తెలిపారు.

అక్కినేని అంటే నాకెంతో గౌరవం. ప్రజలు సైతం ఆయనను అమితంగా గౌరవిస్తారు. ఆయన గురించిన రహస్యాన్ని నేను బయట పెట్టినట్లయితే అక్కినేనిపై ప్రజలు పెట్టుకున్న గౌరవం సగం వరకు తగ్గిపోతుంది అని దాసరి చెప్పారు. అక్కినేనిని గౌరవించినంతగా నేను మరెవరినీ గౌరవించలేదు. కానీ అయన నన్ను అవమానించారు. ఆ విషయాన్ని నేను జీవితంలో ఎన్నడూ బయట పెట్టలేను. అలాగని ఆయన తనకు చేసిన అవమానాన్ని కూడా జీవితంలో మర్చిపోలేను అని దాసరి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Suman Shetty: తనూజ విషయంలో నన్ను బ్యాడ్‌ చేశారు, బిగ్‌ బాస్‌ మోసాన్ని బయటపెట్టిన సుమన్‌ శెట్టి.. భార్య కన్నీళ్లు
Box Office Collections: క్రిస్మస్ సినిమాల కలెక్షన్లు.. ఏ సినిమా టాప్‌లో ఉందంటే?