పవన్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న అకీరా!

Published : Apr 14, 2023, 04:31 PM IST
పవన్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న అకీరా!

సారాంశం

హీరో పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా నందన్ ని ఫ్యాన్స్  భావిస్తున్నారు. అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే స్టార్ ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అకీరా నిర్ణయం వేరుగా ఉంది.   

స్టార్ హీరోల వారసులు హీరోలు కావాల్సిందే. ఇది ఆనవాయితీగా ఉంది. సదరు హీరో కంటే బలంగా ఫ్యాన్స్ దీన్ని కోరుకుంటారు. ఏదో తమ పరువుకు సంబంధించిన విషయంగా ఫీల్ అవుతారు. బాలయ్య తన అభిమానుల నుండి ఇదే తరహా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మోక్షజ్ఞను లాంచ్ చేయండని పెద్ద ఎత్తున వారు డిమాండ్ చేస్తున్నారు. మోక్షజ్ఞ మాత్రం ముఖానికి రంగేసుకోవడం లేదు. అతనికి ముప్పై ఏళ్ల వయసు దగ్గరపడింది. అయినా నటన వైపు అడుగు పడలేదు. 

ఇది నందమూరి అభిమానుల్లో తీరని వేదనగా మిగిలిపోయింది. ఇదే తరహా వ్యధ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అకీరా నందన్ ఆసక్తి నటన మీద కాకుండా మ్యూజిక్ మీద కనబడుతుంది. ఆల్రెడీ ప్రొఫెషనల్ మ్యుజీషియన్ గా అరంగేట్రం చేశాడు. రైటర్స్ బ్లాక్ పేరుతో తెరకెక్కిన ఓ షార్ట్ ఫిల్మ్ కి అకీరా నందన్ మ్యూజిక్ అందించారు. 

ఇటీవల రైటర్స్ బ్లాక్ ట్రైలర్ విడుదల కాగా... అకీరా టాలెంట్ ని ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ కోరుకునేది ఇది కాదు. అతడు హీరో కావాలి. తండ్రి మాదిరి మాస్ రోల్స్ లో అలరించాలి. బ్లాక్ బస్టర్ చిత్రాల హీరోగా అకీరాను నిలబెట్టాలని ఆశపడుతున్నారు. ఒక వేళ అకీరా మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అయితే ఫ్యాన్స్ గుండెలు బద్దలు అవుతాయి. వాళ్ళు ఇన్నాళ్లు కన్న కలలు చెదిరిపోతాయి. 

మరోవైపు అకీరా విషయంలో రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది. వాళ్ళు మా అన్న కొడుకు అంటుంటే... అకీరా నా కొడుకు అని ఆమె అంటున్నారు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన నేను మాత్రమే అకీరాకి తల్లిని అన్నట్లు రేణు దేశాయ్ మాట్లాడుతున్నారు. ఇక అకీరా కెరీర్ విషయంలో రేణు దేశాయ్ నిర్ణయం కూడా కీలకం. తన అభిరుచితో పాటు తల్లి సలహాలు పాటిస్తాడనడంలో సందేహం లేదు. 

రేణు దేశాయ్ చిన్నప్పటి నుండి అకీరాకు మ్యూజిక్ నేర్పించారు. అకీరా పియానో గొప్పగా ప్లే చేస్తాడు. అతని భవిష్యత్తు నిర్ణయాలు ఏమిటో తెలియదు కానీ... ప్రస్తుతానికి మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా