అఖిల్ 'మిస్టర్ మజ్ను'!

Published : Aug 07, 2018, 01:00 PM IST
అఖిల్ 'మిస్టర్ మజ్ను'!

సారాంశం

 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించిన వెంకీ అట్లూరి ఈసారి కూడా లవ్ స్టోరీనే ఎంపిక చేసుకున్నాడు. ఎక్కువ భాగం సినిమా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు టైటిల్ గా 'మిస్టర్ మజ్ను' అనే పేరుని ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ 'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తరువాత 'హలో' అనే మరో సినిమాలో నటించాడు అఖిల్. ఈ సినిమా పర్వాలేదనిపించినా..  కలెక్షన్స్ పరంగా వర్కవుట్ కాలేదు. దీంతో తన మూడో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించిన వెంకీ అట్లూరి ఈసారి కూడా లవ్ స్టోరీనే ఎంపిక చేసుకున్నాడు. ఎక్కువ భాగం సినిమా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు టైటిల్ గా 'మిస్టర్ మజ్ను' అనే పేరుని ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో నాగార్జున హీరోగా నటించిన 'మజ్ను' సినిమా మంచి విజయం సాధించింది. ఆ సెంటిమెంట్ తోనే అఖిల్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా నిధి అగర్వాల్ నటించనుంది. 

PREV
click me!

Recommended Stories

Alia Bhatt: ఫోన్‌లో రణ్‌బీర్ పేరును ఆలియా భట్ ఎలా సేవ్ చేసుకుందో తెలుసా? టాప్ సీక్రెట్
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?