
అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తోన్న తాజా సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. హీరోలను చాలా స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డి మాస్టర్. దృవలో చరణ్, రేసుగుర్రంలో బన్నీ ఇలా యంగ్ స్టార్ ను డిఫరెంట్ గా చూపించాడు దర్శకుడు. అంతే కాదు యాక్షన్ ఎపిసోడ్స్ పై సురేందర్ రెడ్డిది ప్రత్యేకమైన ముద్ర కనిపిస్తుంది. ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది.
ఈ సినిమా కోసం అఖిల్ కంప్లట్ గా మేకోవర్ అయ్యాడు. అసుల మన సిసింద్రీ ఇతనేనా అన్నట్టుగా.. అఖిల్ 8 ప్యాక్ తో.. టోన్డ్ బాడీతో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ లుక్ తో అదరగొడుతన్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. దానికి తగ్గట్టే కృషి చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాను ముందుగా ఆగస్టు 12న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఈమూవీని పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే దసరాకి గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు చాలా మంది దసరా బరిలో ఉన్నారు. అయినా సరే. ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఇక దసరా బరిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, నటసింహం బాలయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాన్, నానీలాంటి చాలా మంది హీరోల సినిమాలు ఉన్నాయి. ఈ స్టార్ హీరోల సినిమాల మధ్యే క్లాష్ వస్తుంది అని ఫ్యాన్స్ ఆందోళనపడుతున్న టైమ్ లో.. ఏ ధైర్యంతో అఖిల్ తన సినిమాను దసరాకు అనౌన్స్ చేవాడో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అఖిల్ కాన్ఫిడెంట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
ఇక అఖిల్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఒక కీలకమైన పాత్రలో మలయాళసూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిళ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.