దిల్ రాజుపై మండిపడుతున్న అక్కినేని అభిమానులు

Published : Mar 25, 2023, 10:26 AM IST
దిల్ రాజుపై మండిపడుతున్న  అక్కినేని అభిమానులు

సారాంశం

మొన్న సంక్రాంతికి ఇలాంటి సమస్యే వచ్చింది. ఆయన నిర్మించిన తమిళ,తెలుగు చిత్రం వారసుడు రిలీజ్ తో. ఇప్పుడు మరోసారి ఓ భారీ తెలుగు చిత్రానికి దిల్ రాజు అడ్డుతగుతున్నాడని ప్రచారం మొదలైంది.  

సాధారణంగా ఏదన్నా పెద్ద సినిమా రిలీజ్ టైమ్ లో మిగతా సినిమాలు తప్పుకుని దారి ఇచ్చేలా ప్లాన్ చేస్తూంటారు. అయితే సీన్ లోకి దిల్ రాజు పెద్ద నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ దిగితే..ఏమౌతుంది. వెనక్కి తగ్గడు. మొన్న సంక్రాంతికి ఇలాంటి సమస్యే వచ్చింది. ఆయన నిర్మించిన తమిళ,తెలుగు చిత్రం వారసుడు రిలీజ్ తో. ఇప్పుడు మరోసారి ఓ భారీ తెలుగు చిత్రానికి దిల్ రాజు అడ్డుతగుతున్నాడని ప్రచారం మొదలైంది. అయితే ఇందులో దిల్ రాజు పొరపాటు ఏమీ లేదు. వివరాల్లోకి వెళితే...

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వచ్చిన ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఏజెంట్ కు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురవుతుంది.అదీ దిల్ రాజు రిలీజ్ చేస్తున్న చిత్రం నుంచి కావటం విశేషం. 

ఆ సినిమా ఏంటంటే.. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’. ఈ చిత్రం  కూడా ఏప్రిల్ 28నే వస్తుంది. ఈ డేట్ ను మేకర్స్ ఎప్పుడో లాక్ చేశారు. ఫస్ట్ పార్ట్ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. అసలు కథ, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ పార్ట్ 2లోనే ఉంటాయని యూనిట్ మొదటి నుంచి ఊరిస్తూ ఈ చిత్రాన్ని వదులుతున్నారు. కాబట్టి ఫస్ట్ పార్ట్ తెలుగులో గొప్పగా ఆడకపోయినా సీక్వెల్ బాగుందనే టాక్ వస్తే.. హిట్టయ్యే అవకాసం ఉంది. ఏజెంట్ కు ట్విస్ట్ ఇస్తుంది. దానికి తోడు  ఇక్కడ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భారీగానే రిలీజ్ ఉంటుంది.  ఏజెంట్ వంటి  ప్యాన్ ఇండియా చిత్రంకు వీలైనంతగా పోటీ లేని సోలో రిలీజ్ చాలా అవసరం కానీ ఏజెంట్ కు అంత అవకాసం కనిపించడం లేదు. 

ఈ నేపధ్యంలో పొన్నియన్ సెల్వన్ కు ట్రైలర్ మార్చి 29 రిలీజ్ ఉందని పోస్టర్ సోషల్ మీడియాలో వదిలారు. ఆ పోస్టర్ క్రింద అఖిల్ అభిమానులు, అక్కినేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. దిల్ రాజు ని నువ్వు తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇవ్వవా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ దిల్ రాజు సొంత సినిమా అయితే పోనీ డేట్ మార్చవచ్చు. కానీ తమిళ డబ్బింగ్ సినిమా కాబట్టి ఆయన చేతిలోనూ ఉండదనేది నిజం.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు...తమిళనాడులో ఈ పొన్నియన్ సెల్వన్  2 వల్ల ఏజెంట్ కి సరైన థియోటర్స్ దక్కకపోవచ్చు. అఖిల్ సినిమాలో   మమ్ముట్టి ఉన్నా కేరళలోనూ అదే పరిస్దితి. అక్కడ కూడా  పొన్నియన్ సెల్వన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మల్టీ స్టారర్ కావడమే కారణం. హిందీలోనే కాస్తంత వెసులుబాటు రిలీజ్ కనపడుతోంది. ఈ పోటీ చాలదన్నట్లు... ఏప్రిల్ 29న పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రం రిలీజ్ గతంలోనే ప్రకటించారు. ఇలా అఖిల్ ..ఏజెంట్ ఈ పద్మవ్యూహంలోంచి బయిటకు రావాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు