
బాలయ్య-బోయపాటి వడివడిగా అఖండ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కాగా, నేటి నుండి క్లైమాక్స్ చిత్రీకరణ మొదలుకానుంది. కాగా ప్రస్తుతం అఖండ టీమ్ తమిళనాడులో ఉన్నట్లు సమాచారం. అక్కడ ఓ ప్రముఖ దేవాలయం దగ్గర అఖండ షూటింగ్ జరపనున్నారు. భారీ ఎత్తున పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించనున్న నేపథ్యంలో, ఓ స్పెషల్ లోకేషన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
అఘోరా గెటప్ లో ఉన్న బాలయ్య భారీ సమూహంతో పోరాడనున్నాడు. ప్రముఖ స్టంట్ మాన్ శివ ఈ క్లైమాక్స్ ఫైట్ కోసం పనిచేస్తున్నారు. బోయాపాటి సినిమాలలో పోరాట సన్నివేశాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇక బాలయ్యతో అంటే అవి మరో స్థాయిలో బోయపాటి చిత్రీకరిస్తారు. అఖండ మూవీ కోసం బోయపాటి అదే స్థాయిలో భారీ ఫైట్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించడం విశేషం. బాలయ్య లుక్స్ ఇప్పటికే విడుదల కాగా ఫ్యాన్స్, ఫిదా అయ్యారు. అఖండ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే అఖండ విడుదల తేదీపై స్పష్టత రానుంది.