కరోనా కట్టడికి తమిళ తారల విరాళం.. అజిత్‌, సౌందర్య‌, ఉదయనిధి స్టాలిన్‌, మురుగదాస్‌ భారీ సాయం..

Published : May 14, 2021, 06:17 PM IST
కరోనా కట్టడికి తమిళ తారల విరాళం.. అజిత్‌, సౌందర్య‌, ఉదయనిధి స్టాలిన్‌, మురుగదాస్‌ భారీ సాయం..

సారాంశం

స్టార్‌ హీరోలు సూర్య, కార్తీలు స్టార్ట్ చేయగా,  ఇప్పుడు వరుసగా అజిత్‌, ఉదయనిధి స్టాలిన్‌, దర్శకుడు మురుగదాస్‌, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ తమ వంతుగా విరాళాలు తమిళనాడు సీఎం స్టాలిన్‌కి అందజేశారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమిళ తారలు ఒక్కొక్కరుగా కదులుతున్నారు. స్టార్‌ హీరోలు సూర్య, కార్తీలు స్టార్ట్ చేయగా,  ఇప్పుడు వరుసగా అజిత్‌, ఉదయనిధి స్టాలిన్‌, దర్శకుడు మురుగదాస్‌, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ తమ వంతుగా విరాళాలు తమిళనాడు సీఎం స్టాలిన్‌కి అందజేశారు. రజనీకాంత్‌ తనయ సౌందర్య రజనీకాంత్‌ తన భర్త విశాగన్‌తో కలిసి కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. టీఎన్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగా సీఎంగా ఎన్నికైన స్టాలిన్‌కి వారు అభినందనలు తెలియజేశారు. 

వీరితోపాటు తలా అజిత్‌ రూ. 25 లక్షలు విరాళంగా అందజేశారు. అలాగే దర్శకుడు మురుగదాస్‌ రూ. 25లక్షలు చెక్‌ని సీఎం స్టాలిన్‌కి శుక్రవారం అందజేశారు. వీరితోపాటు సీఎం స్టాలిన్‌ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ సైతం రూ. 25లక్షలు తమ వంతుగా రాష్ట్రప్రభుత్వానికి విరాళంగా అందించారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇలా కోలీవుడ్‌ తారలు స్పందిస్తూ కరోనాని ఎదుర్కొనేందుకు, కరోనా పేషెంట్లని ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. దీంతో ఇప్పుడు మన తెలుగు స్టార్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. 

ఫస్ట్ వేవ్‌ సమయంలో టాలీవుడ్‌ స్టార్స్ సైతం స్పందించి భారీగా విరాళాలు అందించారు. `సీసీసీ`ని స్థాపించి సినీ కార్మికులను ఆదుకున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో కార్మికులకు నిత్యవసర సరుకులు అందజేశారు. మరి ఈ సారి కూడా వారు స్పందిస్తారో లేదో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో