
తమిళ సూపర్ స్టార్ అజిత్ తో పుష్ప మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పేరు గుడ్ బ్యాడ్ అగ్లీ కాగా.. ఈ ఏడాది జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సంక్రాంతి రిలీజ్ కు పెట్టి పోటీకు దిగుతున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ ని తెలుగులో లాంచ్ చేస్తూ మైత్రీ వంటి పెద్ద బ్యానర్ సినిమా చేయటం ఎవరూ ఊహించలేదు. అయితే అజిత్ ఇలా ఓ తెలుగు,తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అదీ ఓ తెలుగు నిర్మాతకు డేట్స్ ఇవ్వటం వెనక కారణం ఏమిటనేది హాట్ టాపిక్ గా చెన్నై వర్గాల్లో మారింది.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...అజిత్ చాలా ఆలోచించే మైత్రీ మూవీ వారికి డేట్స్ ఇచ్చారు. అందుకు కారణం గత కొంతకాలంగా అజిత్ కు ఇక్కడ తెలుగు డబ్బింగ్ మార్కెట్ పూర్తిగా డ్రాప్ అయ్యిపోవటమే. అజిత్ నటించిన తెలుగు సినిమాలు ఏమీ ఇక్కడ ఆడటం లేదు. దాంతో అంత పెద్ద స్టార్ సినిమా తెలుగు రైట్స్ మూడు నుంచి నాలుగు కోట్లు మించి పోవటం లేదు. థియేటర్స్ దొరకటం కష్టంగానే ఉంటోంది. అదే సమయంలో తమిళ హీరో విజయ్ కు ఇక్కడ స్టార్ డమ్ వచ్చేసింది. ఇరవై కోట్లు దాకా ఇక్కడ బిజినెస్ అవుతోంది. లియోతో ఆ విషయం ప్రూవ్ అయ్యింది.
అలాగే విజయ్ తోతెలుగు దర్శకుడు,నిర్మాత వారసుడు అనే సినిమా చేసారు. ఇక ధనుష్ అయితే తెలుగులో దూసుకుపోతున్నారు. తెలుగులో సార్ అనే సినిమా చేసిన ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ములతో మరో చిత్రం చేస్తున్నారు. రజనీకాంత్,కమల్ సినిమాలకు ఇక్కడ మంచి బిజినెస్ ఉంది. ఎటొచ్చి తనే తెలుగు డబ్బింగ్ రేసులో వెనకబడ్డాడు. అది సెట్ చేయాలంటే తన సినిమాలు ఇక్కడ ఆడాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మైత్రీ మూవీ బ్యానర్ కు డేట్స్ ఇచ్చారు. అ
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూన్ నుంచి షూటింగ్ వుంటుంది. 2025 పండక్కి విడుదల చేయాలని ప్రస్తుతానికి వారిదగ్గర ఉన్న ప్లాన్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా సంగీత దర్శకుడిగా పని చేస్తారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు డైరక్ట్ చేసిన విశాల్, ఎస్ జె సూర్యలతో చిత్రం తెలుగులో బాగా ఆడటంతో అతన్ని దర్శకుడుగా ఎంచుకున్నారు. మైత్రీ వైపు నుంచి చూస్తే వారి మెయిన్ టార్గెట్ తమిళం కాబట్టి సమస్య ఉండదు. తెలుగులో నామమాత్రంగా బిజినెస్ జరిగినా నష్టం ఉండదు అంటున్నారు.
ఈ చిత్రం దర్శకుడు కూడా కాస్త డిఫరెంట్ గా ముందుకు వెళ్లే వాడే. విశాల్ ఎస్జే సూర్య కాంబినేషన్లో ‘మార్క్ అంటోనీ’ అనే వెరైటీ సినిమా తీశాడు అధిక్ రవిచంద్రన్. ఇప్పుడు అజిత్ తో చేయబోయే సినిమా కూడా కాస్త డిఫరెంట్ సెటప్ లో వుంటుదని తెలుస్తోంది. మొత్తానికి పండగ సినిమాల జాబితాలో అజిత్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా చేరిపోయింది.