పోస్టర్ కూడా పడలేదు రూ. 200కోట్ల బిజినెస్

Published : Jul 07, 2021, 03:06 PM IST
పోస్టర్ కూడా పడలేదు రూ. 200కోట్ల బిజినెస్

సారాంశం

అజిత్ గత చిత్రం నెర్కొండ పార్వై చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో తన తదుపరి చిత్రానికి కూడా దర్శకుడిగా వినోత్ ని ఎంచుకున్నాడు అజిత్.

కోలీవుడ్ లో రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత ఆ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్నారు హీరో అజిత్, విజయ్. ప్రస్తుతం వీరి శకమే నడుస్తుంది. ఈ ఇద్దరు హీరోల కొత్త చిత్రాలు వస్తున్నాయంటే చాలు బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవుతున్నాయి. తాజాగా అజిత్ వాలిమై మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. 


కాగా అజిత్ గత చిత్రం నెర్కొండ పార్వై చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో తన తదుపరి చిత్రానికి కూడా దర్శకుడిగా వినోత్ ని ఎంచుకున్నాడు అజిత్. ఇక నెర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. 


దాదాపు 90%షూటింగ్ పూర్తి చేసుకున్న వాలిమై చిత్రం నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. చివరికి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. వర్కింగ్ స్టిల్స్ మినహాయించి వాలిమై మూవీ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అయినప్పటికీ ఈ మూవీ ప్రీ రిలీజ్  బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం అందుతుంది. ఏకంగా రూ. 200 కోట్ల మేర వాలిమై ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిందట. ఎటువంటి అప్డేట్ లేకుండా ఈ మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరపడం నిజంగా రికార్డు అని చెప్పాలి. 
 

PREV
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా