అజిత్‌ సంచలన నిర్ణయం.. ఆ టైమ్‌లో సినిమాలకు బ్రేక్‌

Aithagoni Raju | Published : May 18, 2025 7:34 PM

కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌, రేసింగ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని, ఆ సమయంలో బ్రేక్‌ తీసుకుంటానని తెలిపారు.   

కోలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌, యాక్షన్‌ హీరో‌ అజిత్‌ ఇటీవలే `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. `పట్టుదల` వంటి ఫ్లాప్‌ తర్వాత ఆయనకు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. అభిమానులను ఖుషీ చేసింది. అంతేకాదు ఇటీవల అజిత్‌ కార్‌ రేసులో పాల్గొని విన్నర్‌గానూ నిలిచారు. ఇలా అటు సినిమాలు, ఇటు రేసింగ్‌లో సక్సెస్‌ సాధించి మంచి జోష్‌లో ఉన్నారు అజిత్‌. 

సినిమాలను, కార్‌ రేసింగ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాః అజిత్‌

అజిత్‌ ఇటీవల రెండు మూడు దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని విన్నర్‌గా నిలవడం విశేషం. అంతేకాదు వరుసగా యాక్సిడెంట్లకి కూడా గురయ్యారు. రెండు మూడు నెలల్లోనే ఆయన కారు మూడు సార్లు ప్రమాదానికి గురైంది.

ఈ క్రమంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు అజిత్‌. సినిమాలకు బ్రేక్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. సినిమాలు, రేసింగ్‌ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని, అందుకే రేసింగ్‌ ఉన్న టైమ్‌లో సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. 

రేసింగ్‌ అంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం, 8 నెలల్లో 42 కేజీ తగ్గానుః అజిత్‌

అజిత్‌ మాట్లాడుతూ, రేసింగ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, రేసింగ్‌కి ఫిట్‌నెస్‌ ఎంతో అవసరమని, చాలా రోజుల తర్వాత కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా ఫిట్ గా మారాలని అర్థమైందన్నారు.

స్విమ్మింగ్, సైక్లింగ్‌తోపాటు ఇతర వర్కౌట్లు, డైట్‌ చేశానని గత ఎనిమిది నెలల కాలంలో సుమారు 42 కిలోల బరువు తగ్గినట్టు వెల్లడించారు అజిత్‌. రేసింగ్‌, సినిమా ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని, దాని వల్ల ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చిందన్నారు. 

రేసింగ్‌ ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్‌ః అజిత్‌

రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు అజిత్‌. `రేసింగ్‌ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిజం చెప్పాలంటే నా సినిమాల్లో స్టంట్స్ నేనే చేస్తా. దాని వల్ల నాకెన్నో సర్జరీలు జరిగాయి.

అలా అని యాక్షన్‌ సినిమాలు వదిలేయలేను కదా. అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కి కూడా దూరం కాలేదు. నా దృష్టిలో ఈ రెండు ఒకే లాంటివి` అని అజిత్‌ వెల్లడించారు. తన కొత్త ప్రాజెక్ట్ నవంబర్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు అజిత్‌. ఆయన నిర్ణయం అభిమానులను కొంత నిరాశ పరుస్తుందని చెప్పొచ్చు. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!