బైక్‌ ఛేజింగ్‌.. అజిత్‌కి గాయాలు..ఆసుపత్రిలో చికిత్స

Published : Nov 20, 2020, 08:27 AM IST
బైక్‌ ఛేజింగ్‌.. అజిత్‌కి గాయాలు..ఆసుపత్రిలో చికిత్స

సారాంశం

తమిళ హీరో అజిత్‌కి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `వాలిమై` చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. బైక్‌తో రిస్కీ స్టంట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగింది. దీంతో అజిత్‌ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తమిళ హీరో అజిత్‌కి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `వాలిమై` చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. బైక్‌తో రిస్కీ స్టంట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగింది. దీంతో అజిత్‌ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అజిత్‌కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని రోజులు అజిత్‌ షూటింగ్‌కి దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం అజిత్‌పై బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఎలాంటి డూప్‌ లేకుండా అజిత్‌ స్వయంగా బైక్‌ ఛేజ్‌ స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బైక్‌ స్కిడ్‌ అయి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అజిత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తుంది. బోనీ కపూర్‌ ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్ట్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?