ఆర్ ఆర్ ఆర్ నుండి అజయ్ దేవ్ గణ్ లుక్.. గూస్ బంప్స్ కలగకపోతే ఒట్టు!

Published : Apr 02, 2021, 12:49 PM IST
ఆర్ ఆర్ ఆర్ నుండి అజయ్ దేవ్ గణ్ లుక్.. గూస్ బంప్స్ కలగకపోతే ఒట్టు!

సారాంశం

చుట్టి ముట్టిన బ్రిటీషు సైన్యం తుపాకీ గుండ్లకు గుండె అడ్డుగా ఉంచి నిలబడి ఉన్న అజయ్ దేవ్ గణ్ వీరోచితంగా ఉన్నారు. పంచకట్టు, తలపాగా, రక్తం ఓడుతున్న శరీరంతో ఆయన పోరాటవీరుడ్ని తలపిస్తున్నారు. లోడ్, ఎయిమ్, షూట్... అంటూ ఆదేశాలిస్తున్న బ్రిటీషు దొరను ఫాలో అవుతున్న సైన్యం కి అజయ్ దేవ్ గణ్ ఎలా సమాధానం చెవుతారో సినిమాలో చూడాలి.   

ఒక్కొక్క అప్డేట్ ఆర్ ఆర్ ఆర్ మూవీని మరో స్థాయికి తీసుకెళుతుంది. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోతోనే భారత సినిమా ప్రేమికులను ముగ్దుల్ని చేసిన రాజమౌళి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోతో మరో స్థాయికి తీసుకెళ్లారు. అలియా భట్ సీత లుక్, అలాగే అల్లూరి సీతారామరాజుగా చరణ్ పూర్తి స్థాయి లుక్ సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక నేడు విడుదలైన అజయ్ దేవ్ గణ్ లుక్ సైతం గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. 

చుట్టి ముట్టిన బ్రిటీషు సైన్యం తుపాకీ గుండ్లకు గుండె అడ్డుగా ఉంచి నిలబడి ఉన్న అజయ్ దేవ్ గణ్ వీరోచితంగా ఉన్నారు. పంచకట్టు, తలపాగా, రక్తం ఓడుతున్న శరీరంతో ఆయన పోరాటవీరుడ్ని తలపిస్తున్నారు. లోడ్, ఎయిమ్, షూట్... అంటూ ఆదేశాలిస్తున్న బ్రిటీషు దొరను ఫాలో అవుతున్న సైన్యం కి అజయ్ దేవ్ గణ్ ఎలా సమాధానం చెవుతారో సినిమాలో చూడాలి. 

నేడు అజయ్ దేవ్ గణ్ బర్త్ డే పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆ ఆర్ నుండి ఆయన లుక్ విడుదల చేశారు. ఇప్పటికే అజయ్ దేవ్ గణ్ ఆర్ ఆర్ ఆర్ లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేశారు. మరోవైపు రాజమౌళి శరవేగంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ జరుపుతున్నారు. అక్టోబర్ 13న విడుదల నేపథ్యంలో.. ఈసారైనా చెప్పిన సమయానికి మూవీ విడుదల చేయాలని ధృడ సంకల్పంతో ఉన్నారు. 

చారిత్రక  వీరులైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల స్పూర్తితో కాల్పనికత జోడించి, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు