పవన్ కళ్యాణ్ పాటతో ఐశ్వర్యరాజేష్ కొత్త చిత్రం!

Published : Jul 02, 2019, 08:45 PM IST
పవన్ కళ్యాణ్ పాటతో ఐశ్వర్యరాజేష్ కొత్త చిత్రం!

సారాంశం

యువ నటి ఐశ్వర్యరాజేష్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా రాణిస్తోంది. ఐశ్వర్యరాజేష్ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కవగా నటిస్తోంది.

యువ నటి ఐశ్వర్యరాజేష్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా రాణిస్తోంది. ఐశ్వర్యరాజేష్ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కవగా నటిస్తోంది. క్రికెట్ నేపథ్యంలో కౌసల్య కృష్ణ మూర్తి చిత్రంలో ఐశ్వర్యరాజేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  

తాజాగా ఐశ్వర్య రాజేష్ నటించిన మరో చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఉదయ్ శంకర్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటించిన 'మిస్ మ్యాచ్' చిత్రాన్ని జులై 19న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ప్రేక్షకులని ఆకర్షించే అంశం ఈ చిత్రంలో ఒకటుంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తొలిప్రేమలోని ఓ పాటని ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఎస్వీ నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఐశ్వర్యరాజేష్ మాట్లాడుతూ.. తాను ఎంపిక చేసుకున్న అద్భుతమైన కథల్లో మిస్ మ్యాచ్ చిత్రం ఒకటని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?