
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యనే ఐశ్వర్య, ధనుష్ విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి డివోర్స్ అభిమానులకు ఊహించని షాక్ అనే చెప్పాలి. దాదాపు 17 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరూ ముగింపు పలికారు.
ఐశ్వర్య రజనీకాంత్ తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెడుతోంది. 2012లో ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్ నటించిన 3 చిత్రం వచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత మరో రెండు సినిమాలని కూడా ఐశ్వర్య తెరకెక్కించింది.
కొంతకాలంగా ఐశ్వర్య సినిమాల విషయంలో గ్యాప్ తీసుకుంది. ధనుష్ తో విడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దర్శకురాలిగా బిజీ కావాలని ప్రయత్నిస్తోంది ఐశ్వర్య. తాజాగా ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
బాలీవుడ్ లో ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్లు ఐశ్వర్య ప్రకటించింది. ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం 'ఓ సాథీ చల్'. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ ప్రేమకథ తెరకెక్కబోతున్నట్లు ఐశ్వర్య తెలిపింది. ఈ వారంలో ఇంతకంటే సంతోషకరమైన వార్త లేదు అంటూ ఐశ్వర్య పేర్కొంది.
ఈ చిత్రాన్ని సి 9 పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.