`పుష్ప`లో రష్మిక పాత్రపై ఐశ్వర్య రాజేష్‌ వ్యాఖ్యలు.. తనకే బాగా సెట్‌ అవుతుందంటూ..

Published : May 13, 2023, 08:45 PM ISTUpdated : May 13, 2023, 08:47 PM IST
`పుష్ప`లో రష్మిక పాత్రపై ఐశ్వర్య రాజేష్‌ వ్యాఖ్యలు.. తనకే బాగా సెట్‌ అవుతుందంటూ..

సారాంశం

అద్భుతమైన నటనకు కేరాఫ్‌గా నిలిచే డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ ఇప్పుడు `ఫర్హానా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా `పుష్ప` సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

అందం, అభినయం కలగలిపిన ఐశ్వర్య రాజేష్‌ వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేయడానికి కారణం ఏంటంటే? ఆ ప్రశ్న హీరోలని అడుగుతారా? అంటూ యాటిట్యూడ్‌ చూపించి ఇటీవల వార్తల్లో నిలిచింది ఐశ్వర్య రాజేష్‌. తాజాగా ఆమె మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `పుష్ప` సినిమాలో రష్మిక మందన్నా నటించిన `శ్రీవల్లి` పాత్ర తనకు బాగా సెట్‌ అవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేష్‌ నటించిన `ఫర్హాన` సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది ఐశ్వర్య. 

తెలుగు సినిమాలంటే, తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. అయితే తెలుగులో హీరోయిన్లు తెల్లగా సన్నగా, అందంగా ఉండాలని, గ్లామర్‌ షో చేయాలని, అలాంటి వారినే హీరోయిన్లుగా తీసుకుంటారని, మనకు సెట్‌ కాదులే అనే ఆలోచనతో ఉండిపోయిన సమయంలో `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది ఐశ్వర్య. అందులో తన పాత్ర కూడా తనలాగే డీ గ్లామర్‌గా ఉంటుందని, మొదట నా పాత్ర కనెక్ట్ కావడం కష్టమని భావించా. కానీ రిలీజ్‌ అయ్యాక సినిమా ఆడలేదు, కానీ నా పాత్రకి విశేషంగా ఆదరణ దక్కింది. ప్రశంసలు వచ్చాయి. 

అంతేకాదు `కౌసల్య కృష్ణమూర్తి` సినిమా సైతం పిల్లలకు ఎంతో బాగా కనెక్ట్ అయ్యిందని, ఇక్కడ తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ కూడా ఏర్పడిందని చెప్పింది ఐశ్యర్య. `రిపబ్లిక్‌` సినిమా షూటింగ్‌ టైమ్‌లో చాలా మంది పిల్లలు తనని కలవడానికి వచ్చారని, కానీ అది తాను నమ్మలేదని అయితే కౌసల్య అక్క కోసమని వాళ్లు చెప్పడంతో ఆశ్చర్యపోయానని తెలిపింది ఐశ్వర్య. ఇప్పుడు తెలుగులో ఆఫర్లు రావడం లేదని కాదు, కానీ మంచి పాత్రలతో కమ్‌ బ్యాక్‌ కావాలని ఉందని చెప్పింది. 

ఈ సందర్భంగా `పుష్ప` చిత్రం గురించి చెప్పింది. ఒకవేళ `పుష్ప` తనకు అవకాశం ఇచ్చి ఉంటే కచ్చితంగా చేసేదాన్ని అని చెప్పింది. ఇందులో రష్మిక మందన్నా బాగా నటించారని, కాకపోతే శ్రీవల్లి పాత్ర నాకు బాగా సెట్‌ అవుతుందని తన నమ్మకమని వెల్లడించింది. పరోక్షంగా రష్మిక కంటే తనకే ఇది బాగా సెట్ అవుతుందని ఐశ్వర్య చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?