నరేంద్ర మోడీకి లేఖ.. పాక్ నటులపై సంచలన నిర్ణయం!

By tirumala ANFirst Published Aug 9, 2019, 3:40 PM IST
Highlights

కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో ఆ బిల్లు ఆమోదం పొందడంతో కశ్మీర్ లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. కానీ కానీ పాకిస్తాన్ మాత్రం ఈ నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉంది. 

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ తో వ్యాపార సంబంధాలు తెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలని పూర్తిగా పాక్ లో బ్యాన్ చేశారు. చిత్ర పరిశ్రమపై పాక్ తీసుకున్న నిర్ణయానికి ఇండియాలో రియాక్షన్ మొదలయింది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ తాజాగా ఘాటుగా స్పందించింది. 

ప్రధాని మోడీకి ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ లేఖ రాసింది. ఈ లేఖలో పాక్ చర్యకు ప్రతి ఘటనగా ఇండియన్ చిత్రాల్లో పాకిస్తాన్ నటులు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లని పూర్తి స్థాయిలో నిషేధించాలని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలనీ అసోసియేషన్ ప్రధాని మోడీని కోరింది. 

కశ్మీర్ ని పూర్తి స్థాయిలో ఇండియాలో అంతర్భాగం చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ గుప్తా శుభాకాంక్షలు తెలియజేశారు. 

click me!