మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హోస్ట్ గా మారారు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ రూపొందించిన ఫ్యామిలీ రియాలిటీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘ఆహా’ షోను అధికారికరంగా ప్రకటించింది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మినిమమ్ గ్యారేంటీ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. వరసపెట్టి సినిమాలు చేస్తున్న యంగ్ హీరో ఎవరూ ఊహించని విధంగా హోస్ట్ గా మారారు. బుల్లితెర, ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. తన మాస్ ఇలాఖలోకి స్వాగతం పలుకుతూ సరికొత్త ఫ్యామిలీ రియాలిటీ షోతో వస్తున్నారు.
ఆహా, ప్రముఖ స్థానిక OTT ప్లాట్‌ఫారమ్ నుంచి రాబోయే రియాలిటీ షో "ఫ్యామిలీ ధమాకా". దీనికి విశ్వక్ సేన్ హోస్ట్ గా చేయడం విశేషంగా మారింది. షోపై మరింత ఆషక్తి పెరిగింది. థ్రిల్‌గా ఉంది. దీంతో OTT ప్లాట్‌ఫారమ్‌లో హోస్ట్‌గా విశ్వక్ సేన్ అరంగేట్రం చేస్తున్నారు. గతంలో బాలయ్యతో ‘Unstoppable with NBK రెండు సీజన్లు రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక విశ్వక్ సేన్ కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
Unstoppableతోపాటు "తెలుగు ఇండియన్ ఐడల్", "నేను సూపర్ ఉమెన్" వంటి బ్లాక్‌బస్టర్ రియాలిటీ షోలను ఆహా ప్రారంభించింది. మంచి రెస్పాన్స్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం "ఫ్యామిలీ ధమాకా"తో ఆహా మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించబోతోంది. అన్ని వయసుల ప్రేక్షకులు మెచ్చేలా షోను డిజైన్ చేసినట్టు తెలిపారు. వినోదం విషయంలో తగ్గేదే లేదని వాగ్దానం చేస్తున్నారు. "ఫ్యామిలీ ధమాకా" గురించి మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో అందనున్నాయని తెలిపారు.
ఇక చివరిగా విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో రాబోతున్నారు. విశ్వక్ సేన్ - నేహ శెట్టి జంటగా నటిస్తున్నారు. చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతూ హైప్ పెంచుతున్నారు. అలాగే విశ్వక్ ‘గామీ’, V10 చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హోస్ట్ గా మారి మరింత ఎంటర్ టైన్ చేయబోతున్నారు. బుల్లితెరపై సెన్సేషన్ గా మారబోతున్నారు.