గప్ చుప్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సీనియర్ నటుడి ఎఫైర్!

By Udaya DFirst Published Mar 15, 2019, 2:18 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు అంటూ చాలానే వార్తలు వస్తుంటాయి. అయితే టాలీవుడ్ లో ఇలాంటి వార్తలు అరుదుగా వినిపిస్తుంటాయి.

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు అంటూ చాలానే వార్తలు వస్తుంటాయి. అయితే టాలీవుడ్ లో ఇలాంటి వార్తలు అరుదుగా వినిపిస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో నడుపుతున్న ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. సదరు నటుడు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. 

అతడి తల్లి డెబ్బైలలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు హీరోగా కొన్ని సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

వ్యక్తిగతంగా చూసుకుంటే ఇతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ఎఫైర్ సాగిస్తున్నాడని టాక్. ఆమె తెలుగు  సినిమాల్లో మంచి పేరే తెచ్చుకుంది. తల్లి పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటుంది. చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. వీరిద్దరూ కలిసి కొన్ని చిత్రాలలో నటించారు. 

ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని సమాచారం. సదరు నటి ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా.. ఈ సీనియర్ నటుడి ఇంట్లోనే ఉంటుందట. మొత్తానికి ఈ జంట వారి మధ్య బంధాన్ని బాగానే పెంచుకుంటున్నారు. 

click me!