మీకెందుకు భయం ప్రేక్షకులు భయపడాలి కానీ... మోహన్ బాబుపై ట్రోల్స్ షురూ!

Published : Aug 01, 2022, 11:53 AM IST
మీకెందుకు భయం ప్రేక్షకులు భయపడాలి కానీ... మోహన్ బాబుపై ట్రోల్స్ షురూ!

సారాంశం

మోహన్ బాబు సోషల్ మీడియా ట్రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. ఆయన ఏం చేసినా ట్రోల్ చేయడానికి ఓ వర్గం రెడీగా ఉంటున్నారు. తాజాగా మోహన్ బాబు చేసిన ట్విట్టర్ పోస్ట్ పై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

ఎక్కడ లేని నెగిటివిటీ మంచు ఫ్యామిలీపై చూపిస్తారు నెటిజెన్స్. ఆ ఫ్యామిలీ హీరోలు ఏం చేసిన ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు. మోహన్ బాబు గత చిత్రం సన్ ఆఫ్ ఇండియా ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా ఆ సినిమాకు రాలేదు. సన్ ఆఫ్ ఇండియా విఫలం కావడానికి సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారమే కారణమని మోహన్ బాబు కోర్టు మెట్లెక్కారు. తన సినిమాను ట్రోల్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కేసులు పెట్టారు. 

జరగాల్సిన నష్టం జరిగిపోగా... మోహన్ బాబు ఫ్యామిలీ ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. తాజాగా మంచు లక్ష్మీ నిర్మాతగా అగ్ని నక్షత్రం పేరుతో మూవీ తెరకెక్కుతుంది. మంచు లక్ష్మితో పాటు మోహన్ బాబు ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ప్రతీక్ ప్రజోష్ చిత్ర దర్శకుడు. అగ్ని నక్షత్రం నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆయన ఈ మూవీలో ప్రొఫెసర్ విశ్వామిత్ర రోల్ చేస్తున్నారట. తన ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ లో షేర్ చేసిన మోహన్ బాబు... ఓ కామెంట్ పెట్టారు. ''నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న‘అగ్ని నక్షత్రం'లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను. భయం భయంగా ఉంది'' అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. 

మోహన్ బాబు ఆ పోస్ట్ చేసిన క్షణాల్లో నెటిజెన్స్ ట్రోల్స్ తో దిగిపోయారు. కామెంట్స్ రూపంలో సెటైర్స్ వేయడం స్టార్ట్ చేశారు. మీకెందుకు భయం... ప్రేక్షకులం మేము కదా భయపడాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. మరొక నెటిజెన్...  అంటే మరో సన్ ఆఫ్ ఇండియా లోడింగ్ అన్న మాట అని కామెంట్ చేశారు. అసలు మీకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయిరా బాబు. ఆడకపోయినా సినిమాలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు మరో నెటిజన్. 

రామ్ గోపాల్ వర్మ మాదిరి మంచు కుటుంబం వాళ్ళ సినిమాలు ఆడకున్నా వరుసగా నిర్మిస్తున్నారని విమర్శిస్తున్నారు. మోహన్ బాబు పోస్ట్ క్రింద మెజారిటీ కామెంట్స్ సెటైర్స్ కావడం విశేషం. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారనే పెద్ద అపవాదు ఈ కుటుంబపై ఉంది. ఆ కారణంగానే మంచు లక్ష్మి, విష్ణు, మోహన్ బాబు తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?