ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్న సమీరారెడ్డి.. అతడి సినిమాలే ఇప్పటికీ!

Published : Jun 03, 2019, 03:37 PM IST
ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్న సమీరారెడ్డి.. అతడి సినిమాలే ఇప్పటికీ!

సారాంశం

టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఆన్ స్క్రీన్ జోడీలలో జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి జంట కూడా ఉంది. అశోక్, నరసింహుడు చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, సమీరారెడ్డి గురించి మీడియాలో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. 

టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఆన్ స్క్రీన్ జోడీలలో జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి జంట కూడా ఉంది. అశోక్, నరసింహుడు చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, సమీరారెడ్డి గురించి మీడియాలో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ సమీరారెడ్డి హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే అక్షయ్ వార్థే అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని స్థిరపడింది. 

ఎన్టీఆర్ టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం సమీరారెడ్డి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సమీరారెడ్డి గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల సమీరారెడ్డి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. 

తెలుగులో ఏ హీరో సినిమాలు చూస్తున్నారు అని ప్రశ్నించగా.. నేను నటించిన జూ. ఎన్టీఆర్ సినిమాలే ఎక్కువగా చూస్తుంటా అంటూ సమాధానం ఇచ్చింది. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ, చిత్రాల్లో నటించింది. రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?