గుండెపోటు అనంతరం సుమ షోలో ప్రత్యక్షమైన చలాకీ చంటి... ఇలా అయిపోయాడేంటి?

Published : Jul 28, 2023, 06:28 PM ISTUpdated : Jul 28, 2023, 06:29 PM IST
గుండెపోటు అనంతరం సుమ షోలో ప్రత్యక్షమైన చలాకీ చంటి... ఇలా అయిపోయాడేంటి?

సారాంశం

జబర్దస్త్ మాజీ కమెడియన్ చలాకీ చంటి ఇటీవల అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. గుండెపోటుకు గురైన చలాకీ చంటి కొన్నాళ్ళు బుల్లితెరకు దూరమయ్యారని సమాచారం. చాలా గ్యాప్ తర్వాత చంటి బుల్లితెర మీద కనిపించారు.    

చలాకీ చంటి కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటించారు. అనంతరం జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చారు. చలాకీ చంటిగా పాపులారిటీ తెచ్చుకున్నారు. బుల్లితెర స్టార్ గా ఎదిగిన చంటి సోలోగా కొన్ని షోలు చేశారు. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 6లో చంటి కంటెస్ట్ చేశారు. బుల్లితెర మీద చంటి ఎనర్జీ గురించి తెలిసిన ఆడియన్స్ హౌస్లో దున్నేస్తాడని అనుకున్నారు. కానీ ఏమాత్రం రాణించలేకపోయాడు. తాను సరిగా ఆడలేకపోతున్నానని హోస్ట్ నాగార్జున ముందు ఒప్పేసుకున్నాడు. 

దాంతో మూడు నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. కాగా ఇటీవల చంటి గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితి నుండి చంటి బయటపడ్డట్లు వార్తలొచ్చాయి. చలాకీ చంటి బుల్లితెరకు దూరమయ్యాడు. మూడు నెలల గ్యాప్ అనంతరం చంటి సుమ అడ్డా షోలో ప్రత్యక్షమయ్యాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సన్నీ, సిరి, కాజల్ తో పాటు చంటి సుమ అడ్డా షోకి వచ్చారు. తనదైన పంచ్లలతో అలరించాడు. 

అయితే ఆయన డల్ గానే కనిపించారు. మామూలుగానే సన్నగా ఉండే  చంటి మరింత బరువు తగ్గారు. ఆయన ఫ్యాన్స్ సుమ అడ్డా ప్రోమో వీడియో కింద ఆయన యోగ క్షేమాలు అడుగుతున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేస్తున్నారు. జబర్దస్త్ షోని కాదని చంటి బిగ్ బాస్ కి వెళ్లిన పక్షంలో అతనికి ఇంకా రీ ఎంట్రీ లేదని తెలుస్తుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం