అక్కడ ‘బ్రో’ షోస్ రద్దు! మరో థియేటర్ లో తెర చించేసిన ఫ్యాన్స్.. మిగతా చోట్ల రచ్చరచ్చ

By Asianet News  |  First Published Jul 28, 2023, 5:43 PM IST

 పవనేశ్వరుడు నటించిన ‘బ్రో’ సినిమా థియేటర్లలో విడుదలైంది. మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. తొలిరోజు టాక్ అదిరిపోయింది. దీంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. కొన్ని చోట్ల వారి అతి ఉత్సాహం ఇబ్బందిని కలిగించింది. 


 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో : ది అవతార్’. తమిళ స్టార్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాష్  వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. థమన్ సంగీతం అందించారు. ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లో విడుదలైంది. సినిమా రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల హవా మాములుగా లేదు. సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 

Latest Videos

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామా మాములూగా ఉండగా ఉండదు. ఇక ‘బ్రో‘ విషయంలోనూ అదే జరిగింది. అయితే ఓ సినిమా థియేటర్ లో మాత్రం కొందరు ఫ్యాన్స్ అత్యుత్యాహం చూపించారు. దీంతో స్క్రీన్ చిరిగిపోయింది.  
ఏపీలోని పార్వతీపురం సౌందర్య థియేటర్ లో అభిమానులు రచ్చరచ్చ చేశారు. సంబరంలో మునిగిపోయి ఏకంగా థియేటర్ లోని స్క్రీన్ నే చింపేశారు. దీంతో థియేటర్ యజమానులు సినిమాను నిలిపేశారు. ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగిందనే చెప్పాలి. 

అలాగే ఏపీలోని శ్రీకాకుళంలో ఓ థియేటర్ లో ‘బ్రో’ బెనిఫిట్ షో రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఆ థియేటర్ లో సాంకేతిక కారణాల వల్లే షో వేయలేదని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్ ముందు రచ్చ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సర్దిచెప్పారు. ఆ తర్వాత షోలు ప్రదర్శించబడ్డాయి. ఇక మిగితా అన్ని ఏరియాల్లో ‘బ్రో’ మేనియా దుమ్ములేపుతోంది. 

ముఖ్యంగా హైదరాబాల్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘బ్రో’ కోసం అభిమానులు జాతర చేస్తున్నారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి థియేటర్ల వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఇక సుదర్శన్ థియేటర్ లో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ‘బ్రో’ మూవీ చూశారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోనూ ‘బ్రో’ చిత్రాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. 

click me!