దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సైనికుడి పనిః గూస్‌బమ్స్ తెప్పిస్తున్న మేజర్‌ టీజర్‌

Published : Apr 12, 2021, 04:34 PM ISTUpdated : Apr 12, 2021, 06:27 PM IST
దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సైనికుడి పనిః గూస్‌బమ్స్ తెప్పిస్తున్న మేజర్‌ టీజర్‌

సారాంశం

`దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లని కాపాడటం సైనికుడి పని` అంటున్నారు హీరో అడవి శేష్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `మేజర్‌`. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 

`దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లని కాపాడటం సైనికుడి పని` అంటున్నారు హీరో అడవి శేష్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `మేజర్‌`. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయీ మజ్రేఖర్‌, శోభితా దూళిపాళ్ల  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటన ఆధారంగా, ఆ ఘటనలో పోరాడిన ఇండియన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమా టీజర్‌ని ఉగాది పండుగ సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ముంబయి దాడులతో టీజర్‌ ప్రారంభమైంది. సోల్జర్‌ కి అర్థం ఏంటి? సోల్జర్‌  ఎందుకు కావాలనుకుంటున్నావ్‌.. దేశభక్తా? అని ప్రకాష్‌ రాజ్‌ అడిగే ప్రశ్నించడం, వారిని దేశభక్తులు అంటారు. బార్డర్‌లో ఆర్మీ ఫైట్‌ చేయాలి. క్రికెట్‌లో ఇండియా గెలవాలని అందరు ఆలోచిస్తారు. అదే దేశభక్తి అంటే. దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లని కాపాడటం సైనికుడి పని అని, చివరి నేను వారిని హ్యాండిల్‌ చేస్తా` అని అడవి శేష్‌ చెప్పే డైలాగులు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. 

టీజర్‌లో బీజీఎం అదరిపోయింది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. మొత్తంగా టీజర్‌ అందరిని ఆకట్టుకోవడంతోపాటు హంట్‌ చేస్తుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ, మలయాళంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్‌ని తెలుగులో మహేష్‌బాబు, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ విడుదల చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్