
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ లో ‘హిట్’ సిరీస్ ఒకటి. మొదటి కేసును చేధించడంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యారు. ‘హిట్ : ది సెకండ్ కేస్’ టైటిల్ తో వస్తున్న సీక్వెల్ లో టాలెంటెడ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటిస్తున్నారు. రెండో కేసును సాల్వ్ చేయడంలో అడివి శేష్ మరింత దూకుడుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.
తాజాగా, మరింత ఆసక్తిని పెంచేలా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కట్ చాలా థ్రిల్లింగ్ ఉంది. అడివి శేష్ హిట్ లో పోలీస్ ఆఫీసర్ గా మరోసారి ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా పాత్ర చేశారనిపిస్తోంది. అడివి శేశ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నోటీధూల ఉన్న పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ డిఫరెంట్ లుక్ ను చూపించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఆఫీసర్ కు ఓ ఛాలెంజింగ్ కేసు పడితే ఎలా సాల్వ్ చేశాడనేది టీజర్ ద్వారా చూపించారు. ఈ కేసు ఛేదించడంలో అడివి శేష్ యాక్షన్ కూడా అదిరిపోనుందని అర్థమవుతోంది. ప్రస్తుతం టీజర్ నెట్టింట దూసుకుపోతోంంది.
టాలెంటెడ్ హీరో అడివి శేష్ - శైలేశ్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ‘హిట్ 2. రిలీజ్ కు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ ను షూరు చేసింది. ఇప్పటికే ‘హిట్ వెర్స్’ (Hit Verse)ను దర్శకుడు శైలేష్ పరిచయం చేయడంతో ‘హిట్’ సిరీస్ లపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం సెకండ్ కేసు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. . చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. బాణు చందర్, రావు రమేష్, పోసాని క్రిష్ణ మురళీ, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 2న విడుదల కానుంది.