ట్రైన్ లో అసభ్యంగా టచ్ చేశాడు: అదితి రావ్

Published : Feb 17, 2019, 05:34 PM IST
ట్రైన్ లో అసభ్యంగా టచ్ చేశాడు: అదితి రావ్

సారాంశం

ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకుంటున్న బ్యూటీ అదితి రావ్ హైదారి. అమ్మడు కెరీర్ బాలీవుడ్ లో స్ట్రాంగ్ గా మొదలైనప్పటికీ సౌత్ లోనే ఎక్కువగా బిజీ అవుతోంది. పాత్ర నచ్చితేనే ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తాను అంటోంది.

ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకుంటున్న బ్యూటీ అదితి రావ్ హైదారి. అమ్మడు కెరీర్ బాలీవుడ్ లో స్ట్రాంగ్ గా మొదలైనప్పటికీ సౌత్ లోనే ఎక్కువగా బిజీ అవుతోంది. పాత్ర నచ్చితేనే ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తాను అంటోంది;. అంతరిక్షం సినిమా అంతగా ఆడకపోయినా ఆ సినిమా తనకు నటిగా మంచి తృప్తిని ఇచ్చినట్లు తెలిపింది. 

అదే విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న వేధింపుల ప్రభావం  ఏ విధంగా ఉంది అనే ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇచ్చారు. లైంగిక వేధింపులు అనేవి ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే లేవు. కొందరికి అలాంటి చేదు అనుభవాలు ఎదురై ఉండవచ్చు. అలాగని అందరూ ఒకే తరహాలో ఉంటారని చెప్పడం భావ్యం కాదని చెప్పిన అదితి చిన్న తనంలో తన పట్ల ఒక పెద్దాయన అసభ్యంగా ప్రవర్తించారని సమాధానం ఇచ్చారు. 

నా చిన్నతనంలో లోకల్ ట్రైన్ లో స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా ఓ పెద్దాయన అసభ్యంగా తాకుతూ వెళ్ళబోయాడు. అతన్నీ వెంటనే ఆపేసి మరోసారి ఇలాంటి పనులు చెయకండని గట్టి వార్నింగ్ ఇచ్చాను. ఇంట్లో నాకు ఫ్రీడమ్ ఇస్తూనే ప్రొటెక్ట్ చేసేవారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే విషయాల గురించి అర్థమయ్యేలా చెప్పారు. ఆడపిల్లల్ని అలాంటి విషయాల్లో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందని అదితి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు