`ఆదిపురుష్‌` షాక్‌.. ఆ థియేటర్లలో ట్రైలర్‌ షోస్‌ క్యాన్సిల్‌.. అంతలోనే గుడ్‌ న్యూస్‌!

Published : May 08, 2023, 08:46 PM ISTUpdated : May 08, 2023, 08:54 PM IST
`ఆదిపురుష్‌` షాక్‌.. ఆ థియేటర్లలో ట్రైలర్‌ షోస్‌ క్యాన్సిల్‌.. అంతలోనే గుడ్‌ న్యూస్‌!

సారాంశం

రేపు(మే 9న) `ఆదిపురుష్‌` ట్రైలర్‌ని అధికారికంగా ప్రదర్శించబోతున్నారు. అటు థియేటర్లలో ఫ్యాన్స్ కి, ఇటు డిజిటల్‌ మీడియాలోనూ దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లని ఎంపిక చేశారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు షోస్‌ క్యాన్సిల్‌ చేశారు.

ఇండియన్‌ సినిమాలో మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ మూవీగా వస్తోంది `ఆదిపురుష్‌`. ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా ఈ రోజు ఫ్యాన్స్ కోసం ప్రదర్శించిన ట్రైలర్ కి ట్రెమండస్‌ రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్‌తో అనేక విమర్శలు వచ్చాయి. రియలిస్టిక్‌గా లేదని, వీఎఫ్‌ఎక్స్ దారుణంగా ఉన్నాయనే కామెంట్స్ వచ్చాయి. ట్రోల్‌కి గురయ్యింది. కానీ ట్రైలర్ విషయంలో మాత్రం అలాంటి విమర్శలు రావడం లేదు. దానికంటే చాలా బెటర్‌గా ఉందని రియలిస్టిక్‌గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అభిమానుల మధ్య ప్రభాస్‌, కృతి, ఓం రౌత్‌, నిర్మాతలు ఏఎంబీలో ట్రైలర్‌ని వీక్షించడం విశేషం. కాసేపు అభిమానులతో ముచ్చటించారు ప్రభాస్. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే రేపు(మే 9న) `ఆదిపురుష్‌` ట్రైలర్‌ని అధికారికంగా ప్రదర్శించబోతున్నారు. అటు థియేటర్లలో ఫ్యాన్స్ కి, ఇటు డిజిటల్‌ మీడియాలోనూ దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లని ఎంపిక చేశారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు షోస్‌ క్యాన్సిల్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలో కొన్ని థియేటర్లలో `ఆదిపురుష్‌` ట్రైలర్‌ షోస్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అందుకు కారణం ఆయా థియేటర్లలో త్రీడీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే అని తెలుస్తుంది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. 

`3డీ స్క్రీన్లు లేకపోవడంతో కొన్ని థియేటర్లలో ట్రైలర్‌ ప్రదర్శన రద్దు చేయబడింది. అందుకు చింతించకండి, మేము మీకు అది కవర్‌ అయ్యేలా చేస్తాము. ఆదిపురుష్‌ ట్రైలర్‌ ఐదు అదనపు థియేటర్లలో ప్రదర్శించబోతున్నాం` అని వెల్లడించింది. ఈ మేరకు రద్దు చేయబడ్డ థియేటర్ల లిస్ట్ పేర్కొంది యూనిట్‌. `హైదరాబాద్‌లో కేపీహెచ్‌పీలోని మల్లిఖార్జున థియేటర్ లో, అనంతపూర్‌లోని వీ మెగా క్యూబ్‌ 3డీ, విజయవాడలో అలంకార్‌ థియేటర్లలో ట్రైలర్‌ షోస్‌ని రద్దు చేశారు. 

ఇక ఆ స్థానంలో హైదరాబాద్‌లోని అల్వాల్‌లో నర్తకి, భద్రాచలంలోని ఉదయభాస్కర, అనంతపూర్‌లోని ఎస్వీ సినీ మాక్స్, ఈస్ట్ గోదావరిలో కిర్లంపూడిలోని సూర్యరామ, విజయవాడలోని శైలజ థియేటర్లలో ట్రైలర్‌ని ప్రదర్శించబోతున్నట్టు వెల్లడించింది యూనిట్‌. కొంత డిజప్పాయింట్‌మెంట్‌తోపాటు మరికొంత హ్యాపీనెస్‌ని అందించింది `ఆదిపురుష్‌` టీమ్‌. రేపు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. దాదాపు 70దేశాల్లో వందల థియేటర్లలో ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతుండటం విశేషం.

ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటించిన `ఆదిపురుష్‌`కి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు