వరుసగా రెండు సిరీస్ లతో దర్శకుడు మహి వీ రాఘవ్ సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘సైతాన్’ సిరీస్ తో హాట్ టాపిక్ గ్గా మారాడు. దీంతో టాప్ ఓటీటీ సంస్థల నుంచి ఆయనకు ఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది.
‘సేవ్ ది టైగర్స్’, ‘సైతాన్’ వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఒక్క సిరీస్ సక్సెస్ అయితే భారీగా ఆఫర్లు వస్తున్న రోజుల్లో దర్శకుడు మహివీ రాఘవ్ ఈ రెండు సిరీస్ లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నాడు. 2009 నుంచి డైరెక్టర్ మహి వీ రాఘవ్ (Mahi V Raghav) తెలుగు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈయన తక్కువ సినిమాలే తీసినా ప్రేక్షకుల్లో కొద్దొగొప్పు గుర్తుండిపోయేలా చేశారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత.
విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్ కాఫీ చిత్రాలకు ప్రొడ్యూసర్ గా.. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి చిత్రాలకు దర్శకుడిగా మహి వీ రాఘవ్ కెరీర్ సాగింది. ఇక పొలిటికల్ డ్రామా యాత్ర కరోనాకు ముందుకు రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది. Yatra2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి.
యాత్ర సక్సెస్ మహికి మంచి బూస్ట్ ను అందించింది. అదే సమయంలో కోవిడ్ తో ఓటీటీల హవా మొదలు కావడంతో మహి చూపు అటుపై పడింది. దీంతో Save The Tigers, Saithan సిరీస్ లను రూపొందించారు. రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేశారు. ఈ రెండూ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటున్నాయి.
వరుసగా రెండు సిరీస్ లు సక్సెస్ కావడంతో టాప్ ఓటీటీ సంస్థల చూపు మహి వి రాఘవ్ పై పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను రూపొందించేందుకు ఆఫర్లు ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు ఆయనపై ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ‘యాత్ర’ వరకు నార్మల్ గా సాగిన మహి కెరీర్ ఒక్కసారిగా ఉప్పెనలా లేచిందంటున్నారు. ఇకపై ఆయన పంట పండినట్టేనట్టు అభిమానులు సంతోసిస్తున్నారు. ఇంకా మున్ముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సేవ్ ది టైగర్స్, సైతాన్ సిరీస్ లు షూట్ చేసే సమయంలోనే దర్శకుడు మహి వీ రాఘవ్ ‘సిద్ధా... లోకం ఎలా ఉంది నాయాన’ అనే చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ గానూ ఉన్నారు. దీని తర్వాత ‘యాత్ర2’ రాబోతోంది. ఇందులో జీవాను ప్రధాన పాత్రగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదలా ఉంటే.. ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్న క్రమంలో మహి ఇటు వెబ్ సరీస్ లు, అటు సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏదైమనా మున్ముందు ప్రాజెక్ట్స్ తో మంచి సక్సెస్ ను చూస్తారనేది తెలుస్తోంది.