తిరుమల శ్రీవారి సేవలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్!

Published : Jun 07, 2023, 10:49 AM IST
తిరుమల శ్రీవారి సేవలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్!

సారాంశం

హీరోయిన్ కృతి సనన్ తిరుమల శ్రీవారి సేవలో తరించారు. ఆమె నేడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. కృతి సనన్ తో పాటు దర్శకుడు ఓం రౌత్ ఉన్నారు.   

తిరుపతి వేదికగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుక ఘనంగా ముగిసింది. ఈ వేడుకకు హీరో ప్రభాస్ తో పాటు హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. రామాయణ గాథ కావడంతో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అతిథిగా పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు లక్షల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. 

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం జైశ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ని తన సందేశంతో ఉర్రుతలూగించారు. కాగా నేడు హీరోయిన్ కృతి సనన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఆమె శ్రీవారి సేవలో తరించారు. ఓం రౌత్, కృతి సనన్ తిరుమల సందర్శన వీడియో వైరల్ అవుతుంది. 

ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  విడుదల కానుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2023 సంక్రాంతికి విడుదల చేయాలని మొదట భావించారు. కొన్ని అనివార్య కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడు పాత్ర చేస్తున్నారు. కృతి సనన్ జానకిగా కనిపించనున్నారు. ఇక కీలకమైన రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అలరించనున్నారు. టి సిరీస్, యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించాయి. అజయ్-అతుల్ సంగీతం అందించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?