Bigg Boss Telugu 6: ఆదిరెడ్డి,రోహిత్ లతో కన్నీళ్లు పెట్టించిన బిగ్ బాస్... ఫైనల్ వీక్ లో ఊహించని పరిణామం!

Published : Dec 13, 2022, 05:55 PM IST
Bigg Boss Telugu 6: ఆదిరెడ్డి,రోహిత్ లతో కన్నీళ్లు పెట్టించిన బిగ్ బాస్... ఫైనల్ వీక్ లో ఊహించని పరిణామం!

సారాంశం

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ మొదలైంది. ఫైనల్ కి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా యాభై లక్షలు సొంతం చేసుకునే ఆ లక్కీ ఫెలో ఎవరనే చర్చ నడుస్తుంది.   


బిగ్ బాస్ హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు సభ్యులు ఫైనల్ కి వెళతారు. బుధవారం వరకు పోలైన ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ జరుగుతుంది. మరి చివరిగా హౌస్ ని వీడే ఆ అన్ లక్కీ కంటెస్టెంట్ ఎవరో చూడాలి. కష్టనష్టాల కోర్చి ఫైనల్ కి చేరిన కంటెస్టెంట్స్ ఎప్పటికీ గుర్తించుకునేలా అద్భుతమైన జ్ఞాపకాన్ని బిగ్ బాస్ ఇస్తున్నారు. 

ప్రతి కంటెస్టెంట్ కోసం గార్డెన్ ఏరియాలో అందమైన సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. వారి బిగ్ బాస్ హౌస్ జర్నీలో మధుర ఘట్టాలను ఫోటోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఎమోషనల్ అండ్ ఎంకరేజింగ్ మెసేజ్ వినిపిస్తున్నారు. కంటెస్టెంట్స్ జర్నీపై బిగ్ బాస్ చెబుతున్న ఎమోషనల్ రివ్యూ కట్టిపడేస్తుంది. కంటెస్టెంట్స్ చేత కన్నీరు పెట్టిస్తుంది. 

సోమవారం ఎపిసోడ్లో రేవంత్, శ్రీసత్యలకు బిగ్ బాస్ ఈ ట్రీట్ ఇచ్చాడు. నేడు ఆదిరెడ్డి, రోహిత్ ల ఛాన్స్ వచ్చింది. ఆదిరెడ్డి తన జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోయే మూమెంట్ గా దాన్ని అభివర్ణించాడు. బిగ్ బాస్ హౌస్ కి రావడం, చివరి నిమిషం వరకు హౌస్లో ఉండటం నా కల, అది నెరవేరింది అన్నాడు.

అలాగే రోహిత్ కోసం భార్య మెరీనా హార్ట్ టచింగ్ ఆడియో పంపింది. ప్రేక్షకులు నిన్ను గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. నీ ప్రవర్తనను మెచ్చుకుంటున్నారని మెరీనా రోహిత్ కి చెప్పారు. ఇక బిగ్ బాస్ కూడా రోహిత్ మంచితనం, గుడ్ బిహేవియర్ గురించి ప్రస్తావించాడు. ఆదిరెడ్డి, రోహిత్ లకు బిగ్ బాస్ ఇచ్చిన ఫైనల్ వీక్ ట్రీట్ అదిరిపోయింది. ఇద్దరూ అమితానందం పొందారు. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా