స్టార్ హీరోయిన్ మాజీ ప్రియుడు.. మీడియాపై ఫైర్!

Published : Jan 25, 2019, 11:53 AM IST
స్టార్ హీరోయిన్ మాజీ ప్రియుడు.. మీడియాపై ఫైర్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, నటుడు అధ్యాయన్ సుమన్ కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. కానీ కొన్ని కారణం వలన ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అధ్యాయన్ మైరా మిశ్రాతో డేటింగ్ లో ఉన్నాడు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, నటుడు అధ్యాయన్ సుమన్ కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. కానీ కొన్ని కారణం వలన ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అధ్యాయన్ మైరా మిశ్రాతో డేటింగ్ లో ఉన్నాడు.

ఈ క్రమంలో అతడి డేటింగ్ విషయం గురించి మీడియా వార్తలు ప్రచురించింది. కొన్ని పత్రికలు, వెబ్ సైట్లు అధ్యాయన్ ని కంగనా మాజీ ప్రియుడు అంటూ సంభోదించారు. ఈ విషయంపై అధ్యాయన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరోవ్యక్తి మాజీ ప్రియుడని పిలవడం ఏంటని మీడియాపై ఫైర్ అయ్యాడు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే ఉద్దేశం తనకు లేదని, ప్రేమ-డేటింగ్ పై వదంతలు రావడాన్ని తాను తప్పుబట్టనని.. కానీ మరో వ్యక్తి మాజీ అని అగౌరవంగా మాట్లాడడం బాగోలేదని స్పష్టం చేశాడు.

అధ్యాయన్ అని పేరు పెట్టి పిలిస్తే తనకు గౌరవంగా, సంతోషంగా ఉంటుందని అన్నారు. కంగనాతో విడిపోయిన సమయంలో అధ్యాయన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కంగనా తనను కొట్టేదని, క్షుద్రపూజలు కూడా చేసేదని అధ్యాయన్ అన్నారు. 
 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు