మహాసముద్రం నుండి సిధార్థ ఫస్ట్ లుక్!

Published : Apr 17, 2021, 10:15 AM IST
మహాసముద్రం నుండి సిధార్థ ఫస్ట్ లుక్!

సారాంశం

 చాలా కాలం తరువాత సిద్దార్థ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నారు. మహా సముద్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగు, తమిళ పరిశ్రమలలో వరుస చిత్రాలు చేశారు హీరో సిద్దార్థ. ఆయన నటించిన బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బొమ్మరిల్లు మూవీ టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోవడం విశేషం. తెలుగులో సిద్దార్థ జోరు తగ్గినా, తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. సిధార్థ నటించి ప్రతి తమిళ సినిమా తెలుగులో విడుదల అవుతుంది. 


కాగా చాలా కాలం తరువాత సిద్దార్థ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నారు. మహా సముద్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మహా సముద్రం తెరకెక్కుతుంది. వైజాగ్ నేపథ్యంలో నడిచే మహా సముద్రం మూవీ చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. 

 

నేడు సిద్దార్థ్ బర్త్ డే  పురస్కరించుకొని ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దేనికోసమో క్యూలో ఉన్న సిధార్థ పక్కకు వంగి ఆసక్తిగా చూస్తున్నారు. సిద్దార్థ లుక్ గత చిత్రాలను తలపించడం విశేషం. మహా సముద్రం మూవీతో సిధార్థ తెలుగులో బౌన్స్ బ్యాక్ అవుతారని అనిపిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మానియేల్, అదితిరావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌