‘ది కేరళ స్టోరీ’ OTT రిలీజ్ లేటు .. కారణం అదేనా? అదా శర్మ కామెంట్

Published : Jun 28, 2023, 12:52 PM IST
‘ది కేరళ స్టోరీ’ OTT రిలీజ్ లేటు .. కారణం అదేనా? అదా శర్మ కామెంట్

సారాంశం

‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సినిమా హక్కుల కోసం ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. మాకు ఆమోదయోగ్యమైన ఆఫర్‌ లభిస్తే అప్పుడు ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు.  


 భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించిన ది కేరళ స్టోరీ ఇప్పటిదాకా ఓటిటి రిలీజ్ రాకపోవటం అంతటా చర్చనీయాంశంగా మారింది. మొన్న 23న జీ ఫైవ్ స్ట్రీమింగ్ అని మీడియాలో ప్రచారం జరిగింది కానీ అలా జరగలేదు.  ఎందుకలా జరిగిందని ఎంక్వైరీ చేస్తే  అసలు డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మనేలేదని తేలిపోయింది. బాలీవుడ్​లో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బంపర్ హిట్​గా నిలిచిన చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. అదా శర్మ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ.. ఇంకా ఆలస్యం అవుతోంది ..ఎందుకిలా జరుగుతోంది అంటే...ఈ సినిమాకు  నిర్మాతలు 75 కోట్ల దాకా ఆశిస్తుండటంతో ఓటిటిలు భయపడి వెనుకడుగు వేశాయని ముంబై మీడియా టాక్.  అయితే ఈ వార్తలు అదాశర్మకు కూడా చేరినట్లుంది. ఆమె రెస్పాండ్ అయ్యింది.

  ‘ది కేరళ స్టోరీ’ని ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​కు ఇవ్వాలనే విషయంపై నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఆమె చెప్పారు. బిగ్ స్క్రీన్స్​లో మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఓటీటీ రిలీజ్​ విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి ఇప్పుడు ఒక్క ఓటిటి పార్ట్నర్ కూడా మేకర్స్ కి దొరకడం లేకపోవటమే కారణం అంటున్నారు డైరక్టర్.     చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ మాట్లాడుతూ ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సినిమా హక్కుల కోసం ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. మాకు ఆమోదయోగ్యమైన ఆఫర్‌ లభిస్తే అప్పుడు ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు. సమాజంలోని భిన్న వర్గాల నుంచి ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సినిమా హక్కుల విషయంలో ఓటీటీ సంస్థలు ఆసక్తిచూపడం లేదని తెలుస్తున్నది.. దీనితో అయితే ఈ వార్త ఇంట్రస్టింగ్ గా మారింది.  

ఈ సమ్మర్​లో రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ మూవీ బ్లాక్​ బస్టర్​గా నిలిచింది. రూ.40 కోట్ల బడ్జెట్​తో తీసిన ఈ చిత్రం.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.  ఇదిలా ఉంటే...ఈ టీమ్ మరోసారి చేతులు కలిపి బస్తర్ అనే కొత్త మూవీ అనౌన్స్ చేసింది.  దేశాన్ని సునామిలా ముంచుకొచ్చే ఓ నగ్న సత్యాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. సుదిప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ లాల్ షా నిర్మించబోతున్నారు. కమ్యూనిస్ట్ ప్లస్ నక్సలైట్ బ్యాక్ డ్రాప్  ఎంచుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?