కూతురిపై మరోసారి నటుడి కంప్లైంట్.. పోలీసుల అరెస్ట్!

Published : Dec 08, 2018, 12:00 PM IST
కూతురిపై మరోసారి నటుడి కంప్లైంట్.. పోలీసుల అరెస్ట్!

సారాంశం

సీనియర్ నటుడు విజయ్ కుమార్ గతంలో తన కూతురిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆమె పోలీసుల నుండి తప్పించుకొని కోర్టులో కేసు పెట్టింది.

సీనియర్ నటుడు విజయ్ కుమార్ గతంలో తన కూతురిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆమె పోలీసుల నుండి తప్పించుకొని కోర్టులో కేసు పెట్టింది. తీర్పు ఆమెకు అనుకూలంగా రావడంతో మరోసారి విజయ్ కుమార్ తన కూతురిపై కేసు పెట్టి ఆమెని అరెస్ట్ చేయించాడు.

అసలు విషయంలోకి వస్తే... విజయ్ కుమార్ కి ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దాన్ని ఆయన సినిమా షూటింగ్ లకు అద్దెకు ఇస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ కుమార్ కూతురు నటి వనిత ఓ సినిమా షూటింగ్ చేసుకుంటానని చెప్పి ఆ తరువాత ఆ ఇంట్లోనే ఉండిపోయింది.

ఇల్లు ఖాళీ చేయమని కూతురిని అడిగితే ఆమె రౌడీలను పంపడంతో విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగి సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. న్యాయస్థానం ఈ కేసులో వనితకి ఫేవర్ గా తీర్పునిచ్చింది. ఆమెని ఇంట్లో ఉండకుండా ఎవరూ అడ్డుకోకూడదని, పోలీసులు రక్షణ ఆమెకి కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో వనిత గురువారం తిరిగి ఇంటికి వెళ్లింది. తన కూతురిని ఇల్లు ఖాళీ చేయించాలని విజయ్ కుమార్ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు  వనితని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు..

కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి బయటకి గెంటేశాడు.. సీనియర్ నటుడిపై కూతురు ఫిర్యాదు!

నా కూతురు రౌడీలతో బెదిరిస్తోంది.. సీనియర్ నటుడు

PREV
click me!

Recommended Stories

రికార్డులకు పాతరేసిన మన శంకర వరప్రసాద్ గారు, ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య, వెంకీ, నాగ్ లకు సాధ్యంకాని ఘనత
షాపింగ్ మాల్‌లో ప్రేమ‌, ల‌క్ష‌ల్లో ఒక‌రికి వ‌చ్చే అరుదైన వ్యాధి.. పెద్ది రెడ్డి సింగ‌ర్ జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు