జగన్ ని తిట్టి ఇప్పుడు వైసీపీలోకి.. ఛీ..ఛీ.. శ్రీరెడ్డి కామెంట్స్!

Published : Apr 01, 2019, 03:54 PM IST
జగన్ ని తిట్టి ఇప్పుడు వైసీపీలోకి.. ఛీ..ఛీ.. శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లుగా పోటీ చేసి గెలిచిన జీవిత, రాజశేఖర్ లు ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. 

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లుగా పోటీ చేసి గెలిచిన జీవిత, రాజశేఖర్ లు ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. ఒకప్పుడు జగన్ తో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు.

కానీ ఆ తరువాత పార్టీ నుండి బయటకి వచ్చి జగన్ పై ఆరోపణలు చేసిన ఈ జంట వైఎస్సార్ సీపీలోకి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వీరు టీడీపీలో చేరతారని అంతా భావించారు. ఆ మధ్య చంద్రబాబు పాలనని కొనియాడడంతో పాటు ఆర్ధిక సహాయాన్ని కూడా అందించారు.

దీంతో వారు టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇది ఇలా ఉండగా.. జీవిత, రాజశేఖర్ లు వైసీపీలో చేరడం తట్టుకోలేకపోతుంది నటి శ్రీరెడ్డి. గత కొంతకాలంగా శ్రీరెడ్డికి, జీవితకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శ్రీరెడ్డి తనకు ఛాన్స్ దొరుకుతున్న ప్రతీసారి జీవితపై మండిపడుతూనే ఉంది.

'మా' ఎలక్షన్స్ లో జీవిత, రాజశేఖర్ లకు సపోర్ట్ చేసిన నాగబాబుని తిట్టింది శ్రీరెడ్డి. ఆ తరువాత జీవత, రాజశేఖర్ లను ఉద్దేశిస్తూ.. ''ఆంద్రజ్యోతి ఆర్కే  షోలో జగన్ మంచోడు కాదు, గౌరవం ఇవ్వడు, అతను దొంగ.. లక్షకోట్లు కొట్టేశాడు. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి అవుదామని తెగప్రయత్నించాడని దొంగ ఏడుపులు ఏడ్చిన వాళ్లు మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఛీ.. ఛీ'' అంటూ పోస్ట్ పెట్టింది. 
 
 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ
Gunde Ninda Gudi Gantalu: వామ్మో రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్