దుబాయ్ లో ఉపాసనకు ఘనంగా సీమంతం, దిల్ ఖుష్ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Published : Apr 05, 2023, 03:28 PM IST
దుబాయ్ లో ఉపాసనకు ఘనంగా సీమంతం, దిల్ ఖుష్ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

సారాంశం

పెళ్ళైన 10 ఏళ్ల తరువాత తల్లి కాంబోతుండటంతో ఉపాసన ఆనందానికి అవదుల్లేవు. మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపిని ఈ వార్త.. మెగా ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహాన్ని నింపింది. ఈక్రమంలో ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు జంట. అక్కడ ఉపాసన సీమంతం కూడా చేసకుంది. 

ప్రస్తుతం దుబాయ్ టూర్ లో ఉన్నారు రామ్ చరణ్, ఉపాసన.  ఉపాసన ఇప్పుడు 6 మన్త్ ప్రెగ్నెస్సీతో ఉంది. ఈ ఇద్దరు స్టార్లు కలిసి సరదాగా గడపక చాలా కాలం అయ్యింది. మొన్నటి వరకు RRR ప్రమోషన్స్, RC15 షూటింగ్స్, ఆస్కార్ హడావిడితో రామ్ చరణ్ బిజీగా ఉండటంతో ఇద్దరు పెద్దగా సమయాన్ని గడపలేదు. దాంతో ఇప్పుడు ఫ్రీ అవ్వడంతో ఇద్దరు సొంత ప్లైట్ లో దుబాయ్ చెక్కేశారు. ఇక అక్కడ ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

అయితే ఈ  వెకేషన్ లో రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నారు మెగా జంట. దుబయ్ లో ఉపాసనకి తన  సిస్టర్స్ సీమంతం కార్యక్రమం నిర్వహించారు. దీనికి  ఉపాసన కుటుంబ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు. దుబయ్ లో జరిగిన ఈ సీమంతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేయడంతో పాటు ఈసందర్బంగా  తన సిస్టర్స్ కి థాంక్యూ చెప్పింది.

 

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ప్రగ్నెన్సీ విషయంలో రామ్ చరణ్ మరియు ఉపాసన చాలా ప్లానింగ్ తో ముందుకు వెళ్తారు.  ఈరకంగా చాలా మాటలు కూడా పడ్డారరు ఇద్దరు. చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు ఇడ్డరిని. ఇద్దరితో పాటు మెగా ఫ్యామిలీపై కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు స్ప్రెడ్ చేశారు. అయితే వాటిని ఈ జంట లెక్క చేయలేదు. తమ పని తాము చూసుకుంటూ వెళ్ళిపోయారు. 

ఇక తాజాగా ప్రెగ్నెస్నీలేట్ పై కూడా ఉపాసన స్పందించారు. ఉపాసన మాట్లాడుతూ.. సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను తల్లిని కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం ఆనందంగా, గర్వంగా ఉంది. నేను, చరణ్ ముందే అనుకున్నాం. పెళ్లయిన పదేళ్ల తర్వాతే మేము బిడ్డని కనాలనుకున్నాం.. అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు మేము ఆర్థికంగా బాగా ఎదిగి.. స్ట్రాంగ్ అయినప్పుడే  పిల్లల్ని పెంచగలం అనుకున్నాము. అందుకే ఇంత గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడు మేము మా పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలం.. ఆనమ్మకంతోనే ప్రొసీడ్ అయ్యాం అన్నారు ఉపాసన. ఈ విషయంలో బయట నుంచి... బంధువుల నుంచి ఎలాంటిప్రెజర్స్ వచ్చినా.. మేము తలొగ్గలేదు అన్నారు ఉపాసన. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి