అనుకోకుండా జీవితంలోకి వచ్చి ఏడిపించిపోతారు... సంచలనంగా రేణు దేశాయ్ పోస్ట్!

Published : Apr 04, 2023, 07:30 AM ISTUpdated : Apr 04, 2023, 07:39 AM IST
అనుకోకుండా జీవితంలోకి వచ్చి ఏడిపించిపోతారు... సంచలనంగా రేణు దేశాయ్ పోస్ట్!

సారాంశం

నటి రేణు దేశాయ్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె ఎవరినో ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.   

అప్పుడప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ చర్చకు దారి తీస్తుంటాయి. పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి అంటున్నట్లు ఆమె కామెంట్స్ ఉంటాయి. రేణు దేశాయ్ తాజా పోస్ట్ మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను తలచుకుని రేణు దేశాయ్ బాధపడుతున్నట్లుగా ఆ సందేశం ఉంది. 

'మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు. వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడతాయి. వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చెరగని ముద్ర వేస్తాయి. చాలా ఎడబాట్లు తీరని వేదన మిగుల్చుతాయి. కొందరు మాత్రం మీ బాధలు తొలగించి, ఆనందం నింపిపోతారు' అని రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

తనకు దూరమైన వ్యక్తులను ఉద్దేశించి రేణు దేశాయ్ పొయెటిక్ గా ఈ కామెంట్స్ రాశారు. దీంతో రేణు దేశాయ్ ని అంతగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరనే చర్చ నడుస్తుంది. ఆమె జీవితంలో కొత్తగా ఎవరైనా వ్యక్తులు వచ్చారా? లేక విడాకులు ఇచ్చి దూరమైన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అంటున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
 
2012లో రేణు-పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో పవన్ మూడో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ పవన్ తో రేణు దేశాయ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు. కొడుకు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ కి పవన్ హాజరయ్యారు. అప్పుడు అకీరాతో పాటు రేణు, పవన్ ఫోటోలు దిగారు. 

కొన్నేళ్ల క్రితం రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రకటన చేశారు. దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పవన్ అభిమానులు రేణు దేశాయ్ మీద వేధింపులకు పాల్పడ్డారు. ఆమె మీడియా ముందుకు వచ్చి తన వేదన వెళ్లగక్కారు. అయితే రేణు పెళ్లి ఆలోచనకు బ్రేక్ పడింది. తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మకాం పూణే నుండి హైదరాబాద్ కి మార్చారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ