స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ను తన మేనేజర్ మోసం చేశాడంటూ కొద్దిరోజులుగా రూమర్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆమె మేనేజర్, రష్మిక మందన్న కూడా స్పందించారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిన విషయం తెలిసిందే. దీంతో తన సినిమా విషయాలను, ఆర్థిక లావాదేవీలను స్టాఫ్ చూసుకుంటూ ఉంటారు. అయితే కొద్దిరోజులుగా రష్మిక మందన్న మేనేజర్ మోసం చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.రూ.80 లక్షల వరకు డబ్బులు తప్పించారని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా రష్మిక మందన్న మేనేజర్ స్పందించారు. అలాగే రష్మిక కూడా రెస్పాండ్ అయ్యారు.
రష్మిక మందన్న, మేనేజర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం.. ‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము స్నేహపూర్వకంగా ఎవరి బాటలో వారు నడవాలని నిర్ణయించుకున్నాం. రూమర్ల ప్రకారం దూరమవుతున్నామన్న వాటిలో ఎలాంటి నిజం లేదు. ఇకపై స్వతంత్రంగా పని చేయాలని నిర్ణయించుకున్నాం. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపారు.
ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో పేర్కొన్నారకు. మేనేజర్ తో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ క్రష్ బాలీవుడ్ లో ‘యానిమల్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత Pushpa 2 రానుందని తెలుస్తోంది. మరోవైపు.. రెయిన్ బో, వీఎన్ఆర్ ట్రయోలో నటిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.