షాకింగ్.. ప్రముఖ నటి హత్య, గోనె సంచిలో మృతదేహం.. భర్త బండారం బయటపెట్టిన పోలీసులు

By team teluguFirst Published Jan 19, 2022, 6:25 PM IST
Highlights

చాలా మంది నటీమణుల జీవితాలు విషాదాంతంగా ముగిసిన వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె భర్తే కాలయముడయ్యాడు.

చాలా మంది నటీమణుల జీవితాలు విషాదాంతంగా ముగిసిన వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె భర్తే కాలయముడయ్యాడు. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము కొన్నిరోజుల క్రితం అదృశ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ గోనె సంచిలో శవమై పోలీసులకు కనిపించింది. 

తన భార్య కనిపించడం లేదు అంటూ ఈ నెల 16న రైమా ఇస్లాం భర్త శాకావత్ ఢాకాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో ఢాకా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఢాకాలోని కెరాణిగంజ్ సమీపంలో ఓ గోనె సంచి అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని గోనెసంచిని పరిశీలించగా అందులో ఉన్న మృతదేహం నటి రైమా ఇస్లాం ది అని తేల్చారు. 

దీనితో రైమా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆమె భర్త షెకావత్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. విచారణలో భాగంగా అతడి బండారం బయటపడింది. రైమా ఇస్లాం భర్తే తన స్నేహితుడితో కలసి ఆమెని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

ఇరువురి మధ్య మనస్పర్థలు, కొంతకాలంగా జరుగుతున్న గొడవ కారణంగానే భర్త ఆమెని హత్య చేసినట్లు తెలుస్తోంది. భార్యని హత్య చేసి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఓ బ్రిడ్జి కింద పడేశారు. పైగా తన భార్య కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామా క్రియేట్ చేశాడు. చివరకు బుక్కయ్యాడు. రైమా మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రైమా ఇస్లాం దాదాపు 25 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టివి సీరియల్స్ లో కూడా నటించింది. 

click me!