వరంగల్ చేనేత కార్మికులను కలిసిన నటి పూనమ్ కౌర్!

Published : Feb 22, 2021, 09:24 PM IST
వరంగల్ చేనేత కార్మికులను కలిసిన నటి పూనమ్ కౌర్!

సారాంశం

పూనమ్ కౌర్ చేనేత కార్మికులను కలవడం జరిగింది. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించే పనిలో భాగంగా పూనమ్ కౌర్ వరంగల్ పర్యటనకు రావడం జరిగింది.

నటి పూనమ్ కౌర్ సోమవారం వరంగల్ లో సందడి చేశారు. అక్కడ ఉన్న చేనేత కార్మికులను ఆమె కలవడం జరిగింది. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించే పనిలో భాగంగా పూనమ్ కౌర్ వరంగల్ పర్యటనకు రావడం జరిగింది. ఇక చేనేత కార్మికుల స్థితి గతులు, పరిశ్రమ ప్రస్తుత పరిస్థితుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. 

అలాగే కార్మికుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సంధర్భంగా పూనమ్ కౌర్ కార్మికుల దగ్గర నుండి వరంగల్ దరీస్ ని కొనుగోలు చేశారు. అలాగే చేనేత వస్త్రాలు కొనడం ద్వారా ప్రజలు వారికి అండదండలు అందించాలని విజ్ఞప్తి చేశారు. 

చేనేత వస్త్రాలకు పూనమ్ కౌర్ ప్రభుత్వం తరుపున బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. కావున చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఆమె పాటు పడుతున్నారు. నటిగా తెలుగు, తమిళ మరియు మలయాళ, హిందీ భాషల్లో పూనమ్ కౌర్ నటించారు. ప్రస్తుతం పూనమ్ పెద్దగా వెండితెరపై కనిపించకపోవడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు