పాయల్ రాజ్ పుత్ కు కిడ్నీ ఇన్ఫెక్షన్.. స్వయంగా వెల్లడించిన RX100 బ్యూటీ..ఇప్పుడెలా ఉందంటే?

By Asianet News  |  First Published Mar 21, 2023, 1:11 PM IST

యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) తాజాగా తన ఆరోగ్యంపై షాకింగ్ అప్డేట్ అందించింది. ప్రస్తుత హెల్త్ కండీషన్ పై స్పందిస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. 
 


టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ తాజాగా తను కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలిపింది. కొద్దిరోజులుగా ఈ డిసీజ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇంట్లోనే సెలైన్ పెట్టుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ హెల్త్ పై అప్డేట్ అందించింది.ఈమేరకు ఓ నోట్ కూడా రాసుకొచ్చింది.

నోట్ లో.. ‘నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. దాంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఫలితంగా కాస్తా అనారోగ్యానికి గురయ్యాను. ప్రస్తుతం ట్రీట్ మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్‌ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. రోడ్‌బ్లాక్‌లు ఉన్నప్పటికీ అడ్డంకులను అధిగమించాలి. నా రాబోయే ప్రాజెక్ట్ కోసం షూటింగ్‌ని ఆపలేకపోయాను. షో మస్ట్ గో ఆన్. ఈసారి బిగ్గర్ అండ్ బెటర్ గా ఉంటుంది. మీరందరూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నారు. జాగ్రత్తా’ అంటూ తన ఆరోగ్యం గురించి తెలుపుతూ అభిమానులకు పలు సూచనలు చేసింది.

Latest Videos

ఉన్నట్టుుండి పాయల్ తన హెల్త్ పై ఇలా అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. తన చేతికి సెలైన్ నిడిల్ చూసి తట్టుకోలేకపోతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పాయల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కేరీర్ విషయానికొస్తే.. పాయల్ ప్రస్తుతం మరోసాలిడ్ హిట్ కోసం ఎదురుస్తోంది. వరుసగా అవకాశాలు అందుకుంటున్నా సరైన సక్సెక్ రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్  అప్సెట్ అవుతున్నారు. 

ప్రస్తుతం పాయల్ తన సినిమాలపై మరింత శ్రద్ధ వహిస్తోంది. చివరిగా ‘జిన్నా’ చిత్రంతో అలరించినా.. సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పాయల్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో ఆమె నటించిన ‘గోల్ మాల్’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే ‘ఏంజెల్’, ‘కిరాతక’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే RX100 డైరెక్టర్ అజయ్ భూపతి రీసెంట్ గా అనౌన్స్ చేసిన ‘మంగళవారం’ చిత్రంలోనూ పాయల్ రాజ్ పుత్ నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరీ మున్ముందు ఇంకెలాంటి ప్రాజెక్ట్ తో అలరించబోతుందన్నది.

 

click me!