
ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పాయల్ ఘోష్ కొంతమందికి ఇప్పటికి బాగానే గుర్తు ఉంటుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. మిస్టర్ రాస్కెల్ చిత్రంలో కనిపించింది.కాని ఆ తర్వాత పెద్దగా ఆపర్స్ రాక కనుమరుగైపోయింది. అందం, అభినయం కావాల్సినంత ఉన్న తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత మనవాళ్లు అప్పడప్పుడూ సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూడటం తప్పిస్తే ఆమె వార్తలు తెలియలేదు. కానీ తాజాగా ఆమె ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది.
పాయల్ ఘోష్ తాజాగా తన సూసైడ్ నోట్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ‘ఒకవేళ నాకు గుండెపోటు వచ్చి చనిపోయినా.. లేదా నేను ఆత్మహత్య చేసుకుని మరణించినా అందుకు కారణం ఎవరంటే.. ‘ అంటూ సగం రాసి ఉన్న పేజిని తన ఇన్ స్టాలో షేర్ చేసింది పాయల్. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇనిస్ట్రా నుంచి ఇప్పుడు దానిని తొలిగించింది.
ఇక తెలుగులో యంగ్ టైగర్ అంటే పాయల్‌కు ఫేవరేట్. తారక్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై సంతోషం వ్యక్తం చేసింది పాయల్. జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని 2020లోనే చెప్పాను. ఆస్కార్ విషయాన్ని ముందే అంచనా వేశఆను. నేనెప్పుడూ అబద్ధం చెప్పను అంటూ ట్వీట్ చేసింది పాయల్.